నిండు దుస్తులున్నా ఆమే సెక్సియెస్ట్
పోయినేడాది మాదిరిగానే ఈసారి కూడా కత్రినా కైఫ్ బాలీవుడ్ లో అత్యంత శృంగార తార (మోస్ట్ సెక్సియస్ట్ వుమన్ ఇన్ బాలీవుడ్)గా ఎలా ఎంపికైనట్లు! ఆమె ఈమధ్య కాలంలో ఏ సినిమాలోనూ బికినీల్లో కనిపించలేదు మరి. మనిషి అందాన్ని కళ్లు చెబితే, శృంగార భావాన్ని కలిగించేది వంపుసొంపుల ప్రదర్శనే అనేది చాలా మంది నమ్మే సంగతి. ఉదాహరణకి బిపాషా బసు, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా వంటి తారలు కత్రికా కంటే ఎక్కువగా అందాల ప్రదర్శన చేస్తున్నారు. కానీ శృంగార తారను ఎంచుకొమ్మని ఒక పత్రిక పోలింగ్ పెడితే వాళ్ల కంటే కత్రినాకే జనం ఎక్కువ ఓట్లు వేశారు. సెక్సీగా కనిపించడానికి బికినీతో కనిపించాల్సిన అవసరం లేదని చెబుతుంది కత్రినా. మిగతా తారల కంటే తనకు చాలా ఎక్కువగా ఓట్లు రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తున్నదనీ, దీన్నిబట్టి స్కిన్ షో వల్లే శృంగార భరితంగా కనిపిస్తారనేది తప్పని తేలుతున్నదనీ అంటుందామె.


Click it and Unblock the Notifications











