బిగ్ బీ ఏం చేసినా ఆ స్టైలే వేరు.. 'కౌన్ బనే గా కరోడ్ పతీ" రియాల్టీ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసిన ఘనత అమితాబ్ కే దక్కతుంది. 2005లో ప్రారంభమైన ఈ షో విశేష ఆదరణకు నోచుకుంది. అయితే ''కోయి బీ ఆద్మీ చోటా నహీ హోతా"" పేరుతో కెబీసీ కొత్త సీజన్ ప్రారంభం కాబోతుంది. బాలీవుడ్ మోగాస్టార్ ఈ షోకి ఎంత డిమాండ్ చేస్తున్నాడో తెలుసా.. అక్షరాలా నాలుగు కోట్లంటా. కెబీసీలోని ప్రముఖ వ్యక్తి ఒకరు మాట్లాడుతూ 'బచ్చన్ ప్రయోజితమయ్యే ప్రతి 'షో" కి 4 కోట్లు కావాలని ఆఫర్ చేశారని తెలిపారు". అయితే బాలీవుడ్ బాదుషా మాత్రం అటు 'ఆరక్షన్" సీనిమా ప్రమోషన్ తో పాటు ఇటు కెబీసీ రిహార్సల్స్ తో బీజీ బీజీగా గడుపుతున్నారు.