ప్రాక్టికల్ గా అది అసాధ్యం...సారి: మహేష్ బాబు
వినటానికి చాలా గొప్పగా ఉంది. కానీ మీరే ఆలోచించండి..అది ప్రాక్టికల్ గా పాజిబుల్ అవుతుందా...అని ప్రశ్నిస్తున్నారు మహేష్ బాబు. ఆయన్ని తాజాగా మీడియా వారు..మీ తండ్రి(కృష్ణ), మీరు(మహేష్), మీ అబ్బాయి గౌతమ్ కలిసి ఒకే చిత్రంలో కలిసి నటిస్తే బాగుంటుందని అభిమానలు ఆశపడుతున్నారు..మీరేమంటారు అనే ప్రశ్నను మహేష్ ముందుంచితే..ఆయన పై విధంగా స్పందించారు. అక్కినేని కుటుంబం మూడు తరాలు కలిసి ఒకే చిత్రంలో కృష్ణ వంశి దర్శకత్వంలో కనపడే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రశ్న అడిగారు. అలాగే గౌతమ్ ని. ఛైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేస్తారా అని అడిగితే..వాడు చాలా చిన్న పిల్లాడు. వాడిమీద యాక్టింగ్ ప్రెజర్ పెట్టడం నాకు ఇష్టం లేదు. వాడి ఆలోచనలు, అభిరుచులను బట్టే వాడు భవిష్యత్ లో ఏం చేయాలనే నిర్ణయం తీసుకుంటాడు. నేనేమీ నా ఆలోచనలు,టేస్ట్ లకు తగినట్లుగా అవమని ప్రీ ప్లాన్ చేసి రుద్దను అని నిష్కర్షగా చెప్పారు. ఇక గౌతమ్ పుట్టిన రోజు ఈ రోజు(మంగళవారం). ఈ పుట్టినరోజుని మహేష్ బాబు గోవాలో జరుపుతున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ కి ధట్స్ తెలుగు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











