»   » ‘సాహో’....శ్రద్ధా కపూర్ దిమ్మదిరిగే రెమ్యూనరేషన్

‘సాహో’....శ్రద్ధా కపూర్ దిమ్మదిరిగే రెమ్యూనరేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'సాహో' చిత్రానికి బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా ఖరారైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఈ సినిమాకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయింది.

తెలుగు, తమిళం, హిందీ ఇలా మూడు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు. ఇందులో నుండి హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధా కపూర్‌లకు రెమ్యూనరేషన్ భారీగా అందుతున్నట్లు సమాచారం.

రూ. 12 కోట్లు డిమాండ్ చేసిన శ్రద్ధా కపూర్

రూ. 12 కోట్లు డిమాండ్ చేసిన శ్రద్ధా కపూర్

ఓ ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్ కథనం ప్రకారం... ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ రూ. 12 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. శ్రద్ధా కపూర్ రేంజికి ఇది చాలా పెద్ద మొత్తమే. అయితే ఆమె అలా డిమాండ్ చేయడానికి ఓ కారణం ఉంది.

Prabhas' Saaho Heroine Finally Confirmed
కారణం అదే

కారణం అదే

ఈ సినిమా మూడు భాషల్లో తెరకెక్కుతోంది. డేట్స్ కూడా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణ సినిమాతో పోలిస్తే ఈ చిత్రానికి రెట్టింపు శ్రమ పడాల్సి ఉంటుంది. అందుకే రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేసిందట.

ఒక్కో సినిమాకు 4 కోట్లు

ఒక్కో సినిమాకు 4 కోట్లు

సాధారణంగా శ్రద్ధా కపూర్ ఒక్కో సినిమాకు రూ. 4 కోట్లు చార్జ్ చేస్తుంది. ‘సాహో' మూవీ మూడు భాషల్లో తెరకెక్కుతోంది కాబట్టి ఒక్కో భాషకు రూ. 4 కోట్ల చొప్పున 12 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.

9 కోట్లకు ఒప్పించారు

9 కోట్లకు ఒప్పించారు

బేరసారాల అనంతరం శ్రద్ధా కపూర్ 9 కోట్ల రెమ్యూనరేషన్‌కు ఒప్పుకుందని..... చాలా కాలం క్రితమే శ్రద్ధా కపూర్ పేరు బయటకు వచ్చినా, బేరసారాల కారణంగానే అఫీషియల్ ప్రకటన రావడం లేటయిందని టాక్.

ప్రభాస్ రెమ్యూనరేషన్

ప్రభాస్ రెమ్యూనరేషన్

150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.... ప్రభాస్ అందరికంటే భారీ మొత్తం అందుకుంటున్నాడు. ఆయన రెమ్యూనరేషన్‌గా రూ. 30 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. సినిమా నడిచేది ప్రభాస్ స్టార్ ఇమేజ్ మీదనే కాబట్టి ఆ మాత్రం ఇవ్వడం సబబే అనే వాదన వినిపిస్తోంది.

2018 రిలీజ్

2018 రిలీజ్

‘సాహో' షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
As you all know, Saaho is a big budget film and undoubtedly, Prabhas is the ultimate 'man of the moment'. Do you have any idea, how much these two stars are getting paid for Saaho? Keep reading. Pinkvilla quoted a source as saying, "It's a big budget action extravaganza costing Rs. 150 Crore. Originally Shraddha wanted 12 crore."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu