అనంత్ అంబానీ సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. అత్యధిక పారితోషికం తీసుకున్న సెలబ్రిటీ ఎవరో తెలుసా?
అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. అంతకు ముందు అనంత్, రాధిక మర్చంట్‌లకు ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న రెండవ ప్రీ వెడ్డింగ్ వేడుకలో నాలుగు రోజుల పాటు క్యూయిజ్ పార్టీ జరుగుతోంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రముఖులు ప్రదర్శన ఇవ్వనున్నారు.
ప్రపంచ ప్రఖ్యాత పాప్-రాక్ స్టార్స్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ ప్రైవేట్ లైవ్ ప్రోగ్రామ్ కోసం అంబానీలు భారీగానే ఖర్చు చేస్తున్నారు. ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లి కోసం డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈవెంట్ లో ఎంతోమంది అంతర్జాతీయ స్టార్స్ పాల్గొనగా, వాళ్ళకు రెమ్యూనరేషన్ గా కోట్లు కుమ్మరించినట్టు సమాచారం.

కొలంబియన్ సింగర్ షకీరాకు ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు. ఒక షో కోసం ఆమె కోటి రూపాయలు వసూలు చేస్తుంది. అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో ప్రత్యేకంగా పర్ఫామ్ చేయడానికి ఆమె రూ.15 కోట్లు అందుకుంటున్నట్టు సమాచారం. ప్రముఖ అమెరికన్ సింగర్ కేటీ పెర్రీ కూడా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్‌లో ప్రదర్శన ఇవ్వనున్నారు. కాటి పెర్రీ అత్యంత ఖరీదైన తార. ఈ ఈవెంట్ కోసం ఆమె 45 కోట్ల రూపాయలు తీసుకుంది.
ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ వోకల్ గ్రూప్ 'బ్యాక్ స్ట్రీట్ బాయ్స్' అంబానీ ప్రోగ్రామ్ కోసం రూ.5 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రూప్ లో నిక్ కార్టర్, హోవి డోరో, ఏజె మెక్లీన్, బ్రియాన్ లిట్రెల్, కెవిన్ రిచర్డ్‌సన్ ఉన్నారు.
మార్చి నెలలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది. అప్పుడు కూడా కొంతమంది అంతర్జాతీయ ప్రముఖులు ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చారు. అప్పట్లో రిహానా రూ.74 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో ప్రముఖ పంజాబీ, బాలీవుడ్ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ కూడా ప్రదర్శన ఇచ్చారు. అందుకు 4 కోట్ల రూపాయలు అందుకున్నాడు. గతంలో ఇషా అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో అమెరికన్ సింగర్ బియాన్స్ ప్రదర్శన ఇచ్చింది. ఈ కార్యక్రమం 2019లో జరిగింది. ఆ సమయంలో ఆమె 33 కోట్ల రూపాయలు తీసుకుంది.
ప్రపంచ ప్రఖ్యాత 'కోల్డ్‌ప్లే' బ్యాండ్‌కు చెందిన క్రిస్ మార్టిన్ ఆకాష్ అంబానీ వివాహ వేడుకలో ప్రదర్శన ఇచ్చారు. అందుకు గాను రూ.8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట.


Click it and Unblock the Notifications











