చిరు, బాలయ్యతో నో లాభం: పవన్ కళ్యాణ్‌తో సాధ్యమా?
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా రాజకీయాలతో బిజీ బిజీగా గడిపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలపై తన దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన 'గోపాలా గోపాలా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ తొలిసారిగా భగవంతుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
గతంలోనే కాదు ఇప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమలో రాముడు, కృష్ణుడు తరహా దేవుడు పాత్రలు అంటే అన్నగారు ఎన్టీఆర్ మాత్రమే గుర్తొస్తారు. ఆయన నటించిన ఆ తరహా సినిమాలన్నీ సూపర్ హిట్టు. దేవుడి పాత్రల్లో ఆయన్ను మరిపించే హీరో ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి.
అయితే ఈ మధ్య కాలంలో ప్రధాన హీరో దేవుడి పాత్రలు పోషిస్తూ చేసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా విజయం సాధించడం లేదు. ఆ మధ్య చిరంజీవి నటించిన 'శ్రీమంజునాథ', తర్వాత నాగార్జున నటించిన 'షిరిడి సాయి', బాలయ్య నటించిన 'పాండు రంగడు', 'శ్రీరామ రాజ్యం' చిత్రాలకు మంచి పేరు వచ్చింది కానీ లాభాలు మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో నటిస్తూ 'గోపాలా గోపాలా' చిత్రం వస్తుండటంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గోపాలా గోపాలా చిత్రానికి సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

గోపాలా గోపాలా
హిందీలో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో ‘గోపాలా గోపాలా' పేరుతో రీమేక్ చేస్తున్నారు.

వెంకటేష్,పవన్ కళ్యాణ్
‘గోపాలా గోపాలా' చిత్రంలో వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. హిందీలో అక్షయ్ కుమార్ పోషించిన భగవంతుడి పాత్రను పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ పోషించిన వ్యాపారి పాత్రను వెంకటేష్ పోషిస్తున్నారు.

ఇతర వివరాలు
వెంకటేష్ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్ నిర్మాతలు.

నటీనటులు, టెక్నీషియన్స్
ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్, అంజు అస్రాని తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి.

ఓ మై గాడ్
'కంజి విరుద్ధ్ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం. 'ఓ మై గాడ్'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.


Click it and Unblock the Notifications











