శృంగార మోడల్‌ను ఇలా దోచుకున్నారు...
శృంగార మోడల్ పూనమ్ పాండే ఇటీవల ముంబైలో దోపికి గురైంది. మోటార్ సైకిళ్లపై ఆమె వెంట పడిన దొంగలు ఆమె వెలువైన సెల్ ఫోన్ ను దోచుకున్నారు. పోలీసుల నుంచి అందిన వివరాల ప్రకారం దోపిడీ జరిగిన తీరు ఇలా ఉంది.
లాస్ట్ వీకెండ్ శుక్రవారం రాత్రి ఒక మోటార్ సైకిల్ గ్యాంగ్ పూనమ్ పాండే ఫోన్ మాట్లాడుతూ కార్లో వెలుతున్న విషయాన్ని గమనించి ఆమెను వెంబడించారు. ఆమె కారు అంధేరి(వెస్ట్) ప్రాంతంలోని రద్దీగా ఉండే ఆదర్శ్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు రాగేనే అదును చూసి రూ. 45,000 విలువ చేసే ఆమె ఐ ఫోన్‌ను కొట్టేసి వెళ్లి పోయారు. పూనమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రికెటర్లకు నగ్నంగా అందాల విందు చేస్తానని ప్రకటనలు చేయడం, ఇంటర్నెట్ లో యూత్ కు పిచ్చెక్కించేలా తన హాట్ ఫోటోలు, వీడియోలు పోస్టు చేయడం, ట్విట్టర్లో చేరిన ప్రధానికి బికినీతో వెల్ కం చెప్పడం లాంటి చర్యలతో పూనమ్ గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఫోన్ దొంగల పాలవ్వడం కూడా జాతీయ మీడియాలో చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications












