ఆ క్రేజీ సినిమా కథ ఇదేనా?

అతనికి తానీ(అనూష్క శర్మ) అనే తక్కువ వయస్సు అమ్మాయితో పెళ్ళి అవుతుంది. ఆ ఏజ్ గ్యాప్ వారిద్దరి భావాల్లోనే కాక జీవితంలోనూ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆమె అతన్ని మనస్పూర్తిగా ఏక్సెప్ట్ చేయదు. అయినా షారూఖ్ అదేమి పట్టించుకోక ఆమెను ఎప్పుడూ ఇంప్రెస్ చేయటానికి ప్రయత్నిస్తూంటాడు. సరిగ్గా అదే సమయంలో తాని రబ్ నె బనానే జోడి అనే డాన్స్ కాంపిటేషన్ లో పాల్గొనటానికిఅవకాశం వస్తుంది.
అయితే ఆమెకు తన ఓల్డ్ ఫాషన్డ్ భర్తతో పాల్గొనటానికి ఇష్టం ఉండదు. అప్పుడు అది గమనించిన షారూఖ్ తనను తాను మార్చుకోవటానికి ప్రిపేర్ అవుతాడు. కష్టపడి ఆర్డినరీ లుక్ నుంచి చాలా హాట్ లుక్ కి మారిపోతాడు. అయితే అది ఆమె గుర్తించలేదు. వేరే ఎవరో అనుకుని అతనితో కలసి కాంపిటేషన్ లో పాల్గొంటుంది. అంతేగాక ఆ సమయంలో అతనితో ఎఫెక్షన్ పెంచుకుంటుంది. భర్త అనే విషయం తెలియక ప్రేమలో పడిపోతుంది. చివరకు అసలు విషయం తెలిసి ఆమె ఎలా రియాక్టు అయింది భర్తలో అసలు ప్రేమ కోణాన్ని ఎలా తెలిసికుందనేది క్లైమాక్స్ అంటున్నారు. బాగుంది కదా. అయితే అపరిచితుడు సినిమాలో విక్రమ్ రెమో పాత్ర గుర్తు వస్తోంది కదా.


Click it and Unblock the Notifications











