కోట్లకు పడగలెత్తిన సూపర్‌స్టార్ అత్యంత పేదరికంలోకి .. చివరకు తిండి లేక దిక్కులేని చావు చూసిన హీరో ఎవరో తెలుసా?
సినిమా పరిశ్రమలో ఓడలు బళ్లు అవుతాయి.. బళ్లు ఓడలు అవుతాయనేది అక్షరాల సత్యం. ఈ రోజు మంచి పాపులారిటీతో ఉన్న హీరోలు, నటులు.. ఉన్నట్టుండి కనుమరుగైన దాఖలాలు ఎక్కువగానే చెప్పవచ్చు. ఒకప్పుడు సూపర్ స్టార్‌గా కోట్లు సంపాదించిన సినీ ప్రముఖులు కటిక పేదరికంతో కళ్లు మూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న, కోట్లాది రూపాయల సంపదతో విలాసవంతమైన జీవితం గడిపిన ఓ సూపర్ స్టార్ చివరకు దిక్కులేని మరణంతో తనువ చాలించారు. ఆ సూపర్ స్టార్ నుంచి జూనియర్ ఆర్టిస్గుగా మారిన ఆ నటుడు ఎవరు? ఆయన పేదరికానికి కారణం ఏమిటి అనే విషయాల్లోకి వెళితే.

హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ప్రేక్షకుల నీరాజనం అందుకొన్న నటుడు భరత్ భూషణ్ మీరట్ నుంచి 1920లో బొంబాయికి చేరుకొన్నారు. 1941 సంవత్సరంలో చిత్రలేఖ అే సినిమాతో సినిమా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత అగ్ర నటి మీనా కుమారితో కలిసి బైజూ బావ్రా సినిమాలో నటించి ఓవర్‌నైట్‌లో స్టార్ హీరో అయ్యారు.
వరుస హిట్లు తన ఖాతాలో పడటంతో భరత్ భూషణ్ సూపర్ స్టార్‌గా మారిపోయారు. 1950 దశకంలో అగ్ర హీరోగా చెలామణి అయ్యారు. రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్ లాంటి అగ్ర హీరోలతో ధీటుగా సినిమాల్లో నటించారు. ఆనంద్ మఠ్, మీర్జా గాలీబ్, ముడ్ ముడ్ కే నా దేఖ్ లాంటి హిట్ సినిమాల్లో నటించారు.

అయితే భరత్ భూషణ్ కెరీర్ సవ్యంగా సాగుతున్నదనే సమయంలో ఒక్కసారిగా అథోపాతాళానికి జారుకోవడం మొదలుపెట్టారు. హిట్ సినిమాలతో వచ్చిన సక్సెస్‌ను హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యారు. బాలీవుడ్‌లో అత్యంత ధనికుడిగా పేరున్న భరత్ భూషణ్ తన సోదరుడితో కలిసి సినిమాలు నిర్మించడం మొదలు పెట్టారు. సినిమాలు ఫ్లాప్ కావడంతో దివాళా తీశాడు అని సినీ వర్గాలు చెప్పుకొంటారు.
సినిమాలు ఫ్లాప్ కావడంతోపాటు జూదానికి అలవాటు పడటంతో ఆస్తులు హరించుకుపోయాయి. దాంతో ముంబైలోని ఖరీదైన, విలాసవంతమైన భవనాలను అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పుల్లో కూరుకుపోవడంతో తాను ప్రయాణించిన విలాసవంతమైన కార్లను అమ్మకానికి పెట్టారు. చివరకు ఓ పూరి గుడిసె లాంటి ఇంటిలో బతకడం మొదలుపెట్టాడు.

సూపర్ స్టార్‌గా వెలుగొందిన భరత్ భూషణ్ రోజువారి జీవితం గడవడం కష్టమైంది. బతుకు తెరువు కోసం జూనియర్ ఆర్టిస్టుగా పనిచేయాల్సి వచ్చింది. ఆర్థికంగా చితికిపోయి రోజు తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో మరణించాడు. భరత్ భూషన్ 72 సంవత్సరాల వయసులో 1992 జనవరి 27వ తేదీన ముంబైలో అత్యంత దారుణ పరిస్థితుల్లో కన్నుమూశారు.


Click it and Unblock the Notifications











