twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాహుల్ బాబూ..! నీ చేతులెక్కడెసావ్?: హద్దుల్లేని అందాల హౌరా బ్రిడ్జ్

    హౌరా బ్రిడ్జ్ కొత్త పోస్టర్లలో చాందిని, రాహుల్ పై ఉన్న ఓ ఫొటోలో రాహుల్ చేతులు ఎక్కడ ఉన్నాయో చూస్తుంటే ఇక ఈ సినిమాలో చాందినీ రొమాన్స్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

    |

    Recommended Video

    ఏయ్..! నీ చేతులెక్కడెసావ్ ? హద్దుల్లేని హౌరా బ్రిడ్జ్

    షార్ట్ ఫిల్మ్స్ హీరోయిన్ గా పరిచయమై తన క్యూట్ గ్లామర్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి చాందిని చౌదరి.. ప్రస్తుతం తన కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చే సినిమా కోసం ఎదురుచూస్తోంది. పెద్ద హీరోల సినిమాల్లో చిన్న క్యారెక్టర్లతో సరిపెట్టుకుంటున్న చాందినీ.. అటు చిన్న క్యారెక్టర్లతో పాటు ఇటు హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టుంది.

    హౌరా బ్రిడ్జ్

    హౌరా బ్రిడ్జ్

    చాందినీ ...., రాహుల్ రవీంద్రన్ తో కలిసి లేటెస్ట్ గా హౌరా బ్రిడ్జ్ అంటూ మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం హౌరా బ్రిడ్జ్.

     టైటిల్ వెనక పెద్ద రీజన్ ఉంది

    టైటిల్ వెనక పెద్ద రీజన్ ఉంది

    హౌరా బ్రిడ్జ్ అనే టైటిల్ పెట్టడం వెనక పెద్ద రీజన్ ఉంది. కానీ ఇప్పుడు రివీల్ చేయలేం. హ్యూమన్ రిలేషన్స్ కి ఈకథ బ్రిడ్జ్ గా ఉంటుంది. ఇందులో మరో బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అది ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటూ..., మొదటి నుంచీ కొంత సస్పెన్స్ ని మాత్రం అలాగే ఉంచుతూ వస్తున్నారు.

    చాందిని తెగ హాట్ గా కనిపించింది

    చాందిని తెగ హాట్ గా కనిపించింది

    రాహుల్ రవిచంద్రన్ హీరోగా, చాందిని హీరోయిన్ గా తెరక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇప్పటికే ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ లోనే హీరోయిన్ చాందిని తెగ హాట్ గా కనిపించింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టెయినర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు.. పెంచేందుకు చిత్ర యూనిట్ కూడా చాలా తాపత్రయపడుతోంది.

    రాహుల్ చేతులు ఎక్కడ ఉన్నాయో

    రాహుల్ చేతులు ఎక్కడ ఉన్నాయో

    రీసెంట్ గా విడుదల చేసిన కొన్ని ఫోటోలను చూస్తుంటే చాందిని లిమిట్స్ లేకుండా నటించేసిందా అనే సందేహం కలగక మానదు. చాందిని, రాహుల్ పై ఉన్న ఓ ఫొటోలో రాహుల్ చేతులు ఎక్కడ ఉన్నాయో చూస్తుంటే ఇక ఈ సినిమాలో చాందినీ రొమాన్స్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

    కంటెంట్ లేకపోతే..

    కంటెంట్ లేకపోతే..

    అయితే ఇలాంటి సినిమాలు చాలావరకూ పోస్టర్ల వరకే ఎక్కువగా ఆకర్షించగలుగుతున్నాయి. మూవీలో కంటెంట్ లేకపోతే.. ఎలాంటి పోస్టర్స్ అయినా ఏం చేయలేవు. మరి ఈ సినిమా ఎలాంటి కంటెంట్ తో తెరకెక్కిందో చూడాలి. ఎలాగోలాగ మొత్తానికి కావాల్సినంత బజ్జ్ క్రియేట్ చేయటమే కాబట్టి ఇలా పోస్టర్లతో అయినా కొంత అటెన్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారేమో...

    English summary
    Howrah Bridge Movie Team Released New posters with Hero Rahul Ravichandran and Chandini.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X