twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెట్టుబడే లేని ఆ సినిమా వెనుక రహస్యం ఏమిటి !? రేపైనా తెలిసేనా??

    క్రౌడ్ ఫండింగ్ ద్వారా రాబోయే హృదయాంజలి టైటిల్ లోగో రేపు రవీంద్ర భారతి లో ఆవిష్కరించనున్నారు

    |

    పెద్ద నిర్మాత పెద్దమొత్తం లో డబ్బూ లేకుండానే కేరళ కి చెందిన జాన్ అబ్రహం "అమ్మా అరియన్" అనే ఒక సినిమా తీసారు. జాన్ అబ్రహం తన మిత్రులతో కలిసి ఒడిస్సీ అన్న సంస్థను స్థాపించి కేరళలో వూరూరా తిరుగుతూ అర్థవంతమైన సినిమాల్ని పల్లెల్లో ఉచితంగా ప్రదర్శించాడు.

    ప్రదర్శన తర్వాత మిత్రులంతా జోలె పట్టి గ్రామస్తుల్ని చందా అర్థించేవారు. అలా సమకూర్చిన డబ్బుతో జాన్ "అమ్మా అరియన్" తీశాడు. ఆ సినిమా బ్రిటిష్ ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ వారు ప్రకటించిన పది ఉత్తమ భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అలా అతను డబ్బు సేకరించిన విదానాన్నే క్రౌడ్ ఫండింగ్ అంటారు.

    ఇప్పుడు ఇదొక పెట్టుబడి సమకూర్చుకునే కొత్త పద్దతి.ఇప్పటి పోటీ ప్రపంచం లో ఎప్పుడూ అనుసరించే విధానం లోనే పెట్టు బడి కోరుకుంటే ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే సినిమా ఇప్పుడు కేవలం కళ మాత్రమే కాదు ఇది డబ్బులు సంపాదించిపెట్టే వ్యాపారాత్మక కళ. అందుకే అన్ని సినిమాలకీ మనం పెద్దమొత్తం లో డబ్బు సమకూర్చుకోలేనప్పుడే. పాత పద్దతిలో కాకుండా క్రౌడ్ ఫండింగ్ లాంటి దారుల్ని వినియోగించుకోవాల్సి వుంది. క్రౌడ్ ఫండింగ్ అంటే అనేకమంది నుంచి తక్కువమొత్తాల్లో నిధుల్ని సేకరించడమే.

    Hrdayanjali tittle logo release

    తెలంగాణ సినిమా కోసం కొత్తగా ఆలోచించే యువకులు క్రౌడ్ ఫండింగ్ విధానాన్ని వినియోగించగలిగితే విజయాలు సాధించవచ్చు. దానికి స్పష్టమైన ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించగలిగితే క్రౌడ్ ఫండింగ్‌ను ఆకర్షించగలం. ఇప్పుడు ఔత్సాహిక దర్శకుడు నరేందర్ గౌడ్ నాగులూరి(NNG) అదే ప్రయత్నం లో ఉన్నాడు. తాను తీయబోయే "హృదయాంజలి అనే సినిమా కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారానే పెట్టుబడి సమకూర్చుకుని సినిమా తీయాలనే ప్రయత్నం లోనే ఉన్నాడు.

    ఈ యువదర్శకుడు గతం లో యాది, ఉత్త చేతుల భిక్షపతి,రాజిగ ఒరె రాజిగ లాంటి షార్ట్ ఫిలింస్ చాలా మంది ప్రసంసలనందుకున్నాయి. ఇక కోయల ఆట పాటల పై తీసిన ఆర్ట్ ఎట్ హార్ట్ అనే డాక్యుమెంతరీ, శివతాందవం/ రుద్రతాండవం అని పిలువబడే కాకతీయుల కాలం నాటి నృత్యనీతి పేరిణి నృత్య కళాకారుల జీవితాన్ని ప్రతిబింబిస్తూ ద ర్యాక్ టు రిచెస్ట్ జర్నీ పేరుతో తెరకెక్కించిన డాక్యుమెంటరీ లో నటరాజ రామకృష్ణ మొదటి నుంచి ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు పేరిణీ అభివృద్ధి కోసం ఆయన పడ్డ శ్రమను చూపించిన తీరు పలువురిని ఆకట్టుకుంది.

    Hrdayanjali tittle logo release

    హృదయాంజలి జర్నీ మొదలు పెట్టబోయే మొదటి ప్రయత్నం గా రవీంద్ర భారతిలో రేపుసాయంత్రం 5 గంటలకు. టైటిల్ లోగొ రిలీజ్ చేయబోతున్నారు. తెలంగాణా భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చేతుల మీదుగా ఈ లోగో ఆవిష్కరించబడనుంది. ఆతర్వాత అక్కడే ఈ సినిమా దర్శకుడు NNG తన అసోసియేట్ డైరెక్తర్ అక్షర కుమార్ తో కలిసి అసలు క్రౌడ్ ఫందింగ్ అంటే ఏమిటీ?? ఆ పద్దతిలో తాను ఎలా సినిమా చేయబోతున్నాడు అన్న విషయాన్ని కలిసి చెప్పబోతున్నాడు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులూ, ఔత్సాహిక సినీ పరిశ్రమలోని ఇతర విభాగాల నిపుణులూ రానున్నారు.

    English summary
    Telangana First croud funding Movie Hrudayaanjali Tittile Logo woll be Released on 4th Feb at ravindrabharati Sinivaaram program.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X