హృతిక్ ఫిట్ నెస్ ఖరీదు నెలకు రూ.20 లక్షలు
తమ బాడీ షేపులు మార్చుకోవడానికి మామూలు వ్యక్తులు ఫిట్ నెస్ కోసం నెలకు ఎంత ఖర్చు పెడతారు? ఒకటి లేదా రెండే వేల రూపాయాలు. సినిమా స్టార్ల విషయానికొస్తే ఈ ఖర్చు ఇంకో వందరెట్లు ఎక్కువ ఉంటుందని అంచనా వేసినా....లక్ష, రెండు లక్షలకు మించదు. కానీ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఇందుకోసం నెలకు రూ. 20 లక్షలు ఖర్చుపెట్టబోతున్నాడు. మరీ ఇంత ఖర్చు ఎందుకు? అంటే తన తదుపరి చిత్రం క్రిష్-2 కోసమే అనే వార్త బాలీవుడ్ లో వినిపిస్తోంది. అంతర్జాతీయ ట్రైనర్ క్రిస్ గెతిన్ ని స్పెషల్ గా ముంబైకి రప్పించుకొని తన ట్రైనీగా పెట్టుకోనున్నాడని తెలుస్తోంది. ఈ 20 లక్షలు నెలకు కేవలం అతని ఫీజు మాత్రమే. ఈ సినిమా కోసం కొత్త లుక్ తెచ్చుకోవడానికి హృతిక్ ప్రయత్నిస్తున్నారని, అందుకే ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడానికి సిద్ధం అయ్యాడని బాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు క్రిస్ ఇక్కడికి రానున్నాడని సమాచారం.
గతంలో హృతిక్ నటించిన క్రిష్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో.... క్రిష్-2 తో దాన్ని మించి పోవాలని ఆశిస్తున్న హృతిక్...ఈ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. రాకేశ్ రోషన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2012లో విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











