షారుఖ్ భార్య హాట్ అంటూ హృతిక్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ భార్య గౌరీ ఖాన్‌పై మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన కమెంట్స్ అందరినీ విస్మయానికి గురి చేశాయి. ఇంతకీ హృతిక్ చేసిన కామెంట్స్ ఏమిటో తెలుసా? షారుఖ్ భార్య గౌరీఖాన్ చాలా అందంగా హాట్‌గా ఉంటుంది, ప్రపంచంలోని పిటపిటలాడే అందగత్తెల్లో ఆమె కూడా ఒకరు అంటూ తన ట్విట్టర్లో వ్యాఖ్యానించాడు హృతిక్. ఏ ఉద్దేశ్యంతో అతడు ఇలా వ్యాఖ్యానించాడో తెలియదు కానీ....బాలీవుడ్‌లో దీనిపై ఒకటే చర్చ.
అసలే గౌరీ ఖాన్ నిక్కచ్చిగా ఉండే మనిషి. ఎఫైర్లు అంటే అస్సలు గిట్టదు. ఇటీవల షారుఖ్-ప్రియాంక ఎఫైర్ నడిసిస్తున్నారనే విషయం తెలుసుకుని మొగుడికి వార్నింగ్ కూడా ఇచ్చిందట. తాజాగా హృతిక్ తన గురించి ఇలా వ్యాఖ్యానించడంతో ఏం చేయాలో ఆమెకు తోచడం లేదని. దీన్ని ప్రశంసగా తీసుకోవాలా? లేక వేరే వారు ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటారని బాధ పడాలో ఆమెకు పాలు పోవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే హృతిక్ వ్యాఖ్యలను బాలీవుడ్ సెల్రబిటీలు పాజిటివ్ గా తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో హట్‌గా ఉన్నారు, సెక్సీగా ఉన్నారు లాంటి పదాలను తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పనిలేదని, మోడర్న్ యుగంలో పుట్టుకొచ్చిన కొత్త ప్రవంసలు అంటున్నారు. గౌరీ ఖాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోదనే అభిప్రాయం చాలా మంది నుంచి వ్యక్తం అవుతోంది.


Click it and Unblock the Notifications











