హృతిక్-కత్రినా లిప్ లాక్ మరోసారి?
హైదరాబాద్: బాలీవుడ్ మోస్ట్ గుడ్ లుకింగ్ ఆన్ స్క్రీన్ జంటలుగా పేరు తెచ్చుకున్న వారిలో హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ పేర్లను ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఆ మధ్య వచ్చిన 'జిందగీ నా మిలేగి దుబారా' చిత్రంలో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌంట్ అయింది. ఆడియన్స్ నుంచి కూడా ఈ జంటకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఈ ఇద్దరు 'బ్యాంగ్ బ్యాంగ్' అనే చిత్రంలో కలిసి నటించబోతున్నారు.
తాజాగా బాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.... బ్యాంగ్ బ్యాంగ్ చిత్రంలో ఈ ఇద్దరు మరోసారి ముద్దు సీన్లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. గతంలో వీరు 'జిందగీ నా మిలేగీ దుబారా' చిత్రంలో ముద్దు సీన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. మరోసారి ఈ జంటతో ముద్దు సీన్ చేయిస్తే సినిమాకు బాగా ప్లస్సవుతుందనే భావన వ్యక్తం అవుతోంది.
'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా 'నైట్ అండ్ డే' అనే హాలీవుడ్ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా చెబుతున్నారు. 'నైట్ అండ్ డే' చిత్రంలో హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూయిజ్, కమెరూన్ దియా కలిసి నటించారు. ఈ ఇద్దరి మధ్య ముద్దు సీన్లు హాలీవుడ్ ప్రేక్షకులను భాగా ఎంటర్ టైన్ చేసాయి. ఈ నేపథ్యంలో 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమాలో కూడా అవే ముద్దు సీన్లను రిపీట్ చేయనున్నారు.
బ్యాంగ్ బ్యాంగ్ చిత్రానికి సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మేరకు హృతిక్, కత్రినాలను ముద్దు సీన్లు చేయడానికి దర్శకుడు ఒప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం యాక్షన్ అండ్ కామెడీ నేపథ్యంలో రూపొందబోతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











