కత్రినా, హృతిక్ రొమాంటిక్ సీన్స్ (బ్యాంగ్ బ్యాంగ్ ఫోటోస్)
హైదరాబాద్: హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా బాలీవుడ్లో 'బ్యాంగ్ బ్యాంగ్' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కత్రినా, హృతిక్ మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి.
సాధారణంగా ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారంటేనే సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి. తాజాగా వీరికి సంబంధించిన హాట్ ఫోటోస్ విడుదల చేయడం ద్వారా సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెంచుతున్నారు దర్శక నిర్మాతలు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
చివరిసారిగా ఈ ఇద్దరు స్టార్స్ 'జిందగీ న మిలేగి దొబారా' చిత్రంలో కలిసి నటించారు. ఆ చిత్రంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి నటిస్తుండటంపై సర్వతా ఆసక్తి నెలకొంది. యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదో భారీ బడ్జెట్ చిత్రం.
స్లైడ్ షోలో కత్రినా కైఫ్, హృతిక్ రోషన్‌కు సంబంధించిన రొమాంటిక్ సీన్లు...

తెలుగులో కూడా...
ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వసూళ్లు ఖాయం
ఇంతకు ముందు హృతిక్ నటించిన క్రిష్ చిత్రం తెలుగు, తమిళంలో మంచి వసూళ్లు సాధించడంతో....'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రాన్ని కూడా తెలుగు తమిళంలో విడుదల చేస్తున్నారు.

విడుదల తేదీ
అక్టోబర్ 2వ తేదీన ఈచిత్రం విడుదల కాబోతోంది.

హృతిక్ లుక్
హృతిక్ రోషన్ గ్రీక్ లుక్, ఆటిట్యూడ్ ఈ సినిమాలో మరింత బెస్ట్ గా ఉండనున్నాయి.

అదిరిపోయే డాన్స్
బాలీవుడ్లోని బెస్టర్ డాన్సర్లలో హృతిక్ రోషన్ ఒకరు. ఈచిత్రంలోనూ ఆయన తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోనున్నారు.

కెమిస్ట్రీ
ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. రొమాంటిక్ లుక్స్ బాగున్నాయి.

యాక్షన్ సీన్స్
ఇప్పటి వరకు బాలీవుడ్లో ఏ సినిమాలోనూ లేని విధంగా ఈ చిత్రంలో యాక్షన్ సీన్లు చూడబోతున్నాం.

బెస్డ్ జోడీ
అందం, అభినయం, ఫిజిక్, పెర్ఫార్మెన్స్, హైట్ ఇలా అన్ని విధాలుగా హృతిక్, కత్రినా బెస్ట్ జోడీ అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు


Click it and Unblock the Notifications











