హృతిక్ సరసన పెనెలొప్ క్రజ్
కండలవీరుడు హృతిక్ రోషన్ కు ప్రమోషన్ వచ్చింది. ఆయనకు హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం అదీ పెనెలొప్ క్రజ్ సరసన వచ్చింది. అదేనండీ టామ్ క్రూయిజ్ మాజీ ప్రియురాలు. హృతిక్ రోషన్, పెనెలొప్ క్రజ్ హీరోహీరోయిన్లుగా నటించే ఈ హాలీవుడ్ సినిమాను రాకేష్ రోషన్ ప్రొడక్షన్ హౌస్, హాలీవుడ్ కు చెందిన ఒక ప్రొడక్షన్ హౌస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి 50 మిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్టు సమాచారం. విశేషమేమంటే స్పానిష్ నటి అయిన పెనెలొప్ క్రజ్, హృతిక్ రోషన్ సరసన నటించడానికి ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తోందిట. ఆమెకు హృతిక్ రోషన్ గ్రీకు వీరుడిలా కనిపిస్తున్నాడట.


Click it and Unblock the Notifications











