హిందీ ‘మగధీర’ పై రామ్ చరణ్ అభిప్రాయం..!
ఈ మద్య కాలంలో దక్షిణాది చిత్రాలకు బాలీవుడ్ లో చాలా డిమాండ్ ఏర్పడుతోంది. పోకిరి, సింగం, విక్రమార్కుడు, వంటి చిత్రాలు హిందీలో రీమేక్ కావడంతో పాటు పలు హిట్ చిత్రాలకు పోటీ ఏర్పడుతోంది. ప్రతి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గన్, జాన్ అబ్రహామ్ వంటి స్టార్లు ఆల్రెడీ రీమేక్ చిత్రాల్లో నటించారు..నటిస్తున్నారన్న విషయం తెలిసిందే...మరి సౌత్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'మగధీర" ని ఏ బాలీవుడ్ స్టార్ సూటవుతారన్నా ప్రశ్నకి సమాదానంగా చరణ్...
రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్'మగధీర" చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందన్న విషయాన్ని చరణ్ దగ్గరే ప్రస్తావిస్తే 'నా దృష్టిలో మగధీర" ఒక మ్యాజికల్ మూవీ. ప్రతిసారీ అంత గొప్పగా ఆ సినిమాని చెయ్యగలరని నేను అనుకోవడంలేదు. అయినా ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందో చెప్పాలంటే హృతిక్ రోషన్ ఫర్ ఫెక్ట్ గా సూట్ అవుతాడు. రణబీర్ కపూర్ కూడా చేయ్యగలడు.
రణబీర్ కపూర్ యంగ్ హీరో కాబట్టి ఎలాంటి క్యారెక్టర్ లో అయినా ఒదిగిపోయి చెయ్యగలడని నా నమ్మకం" అన్నాడు. అయితే కాజల్ మాత్రం రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ కి సల్మాన్ ఖాన్ అయితే సూటబుల్ అని చెప్తోంది. ఈ ఇద్దరి ఒపీనియన్స్ లో ఎవరిది నిజమవుతుందో తెలుసుకోవాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే...


Click it and Unblock the Notifications











