twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండియా కోసం హాలీవుడ్ తారల విరాళాలు.. ఆ లిస్టులో ఇండియన్ హీరో కూడా

    |

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. రోజుకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇండియాలోని విషాద ఛాయలు హాలీవుడ్ తారలను కూడా కదిలించాయి. మొదటిసారి కొంతమంది ఇంగ్లీష్ తారలు ఇండియాకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇక అందులో హృతిక్ రోషన్ కూడా చేరాడు.

     నేషనల్ మీడియాలో విమర్శలు

    నేషనల్ మీడియాలో విమర్శలు

    కరోనా రోజురోజుకు మరింత ఉదృతంగా మారుతోంది. ఈ ఏడాది కరోనా నుంచి బయటపడుతున్నామని సంతోషించే లోపే సెకండ్ వేవ్ లో కోవిడ్ 19 విలయతాండవం మొదలు పెట్టింది. ఇంకా సరైన మరణాల సంఖ్య కూడా బయటకు రావడం లేదని తెలుస్తోంది. ఆ లెక్కలపై నేషనల్ మీడియాలో కూడా అనేక రకాల విమర్శలు వస్తున్నాయి.

    కదిలొచ్చిన హాలీవుడ్ తారలు

    కదిలొచ్చిన హాలీవుడ్ తారలు

    ఇక మన దేశంలో బిగ్గెస్ట్ సెలబ్రేటీలు సహాయం చేయకపోయినప్పటికి హాలీవుడ్ తారలు ఒక్కొక్కరు విరాళాలు అంధించి ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్ర హీరోల్లో ఒకరైన స్మిత్ తన ఫ్యామిలీ తరపున మొత్తంగా 50,000 డాలర్లను కోవిడ్ రిలీజ్ ఫండ్ కోసం అందజేశారు.

    కెనడియన్ సింగర్, ప్రఖ్యాత రచయిత భారీ విరాళం

    కెనడియన్ సింగర్, ప్రఖ్యాత రచయిత భారీ విరాళం

    ఇక టాప్ కెనడియన్ సింగర్ , రైటర్, షాన్ మెండిస్ తో పాటు ప్రముఖ ప్రఖ్యాత రచయిత బ్రెండన్ బుర్చార్డ్ కూడా 50,000 డాలర్లను విరాళంగా అంధించాడు. వారందరూ కూడా ఇండియా త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఐటి కాస్మటిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జామీ కెర్న్ లిమా కూడా 100,000 డాలర్లు ప్రకటించింది.

    Recommended Video

    Even Hollywood Didn't Come Up with This Concept | Ek Mini Katha
    హృతిక్ రోషన్ కూడా..

    హృతిక్ రోషన్ కూడా..

    ఇక వరల్డ్ నెంబర్ వన్ షోలలో ఒకటైన ద ఎల్లెన్ షో ద్వారా 59,000 డాలర్ల విరాళాలు సేకరించి భారత ప్రభుత్వానికి అందించారు. మన స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా 15,000 డాలర్లను విరాళంగా ఇవ్వగా క్యూబన్-అమెరికన్ గాయని - పాటల రచయిత కామిలా కాబెల్లో తనవంతు సహాయంగా 6,000 డాలర్లు అంధించింది.

    English summary
    Superstar Hrithik Roshan joined hands with Hollywood stars to help raise funds for India's COVID19 relief efforts. The actor has helped to raise an estimated USD 3.68 million. Author JayShetty revealed Hrithik has contributed USD 15,000 to the fundraiser.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X