డబ్బులుంటే చాలు...ఆ హీరోకు ముద్దు పెట్టొచ్చు!
బాలీవుడ్‌లో ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లదే హవా. ఇక వాళ్లను బీట్ చేసే హీరో రాడంటూ అంతా అనుకుంటున్న తరుణం వాళ్లకి గట్టి పోటీ ఇచ్చే స్టార్ గా ఎదగడమే కాదు, దేశ వ్యాప్తంగా అభిమాను సంపాదించుకున్నాడు. అతడే బాలీవుడ్ సెక్సీ యాక్టర్ హృతిక్ రోషన్. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగానే లండన్ లోని ప్రఖ్యాత 'మేడమ్ టుస్సాడ్స్" మ్యూజియంలో హృతిక్ రోషన్ మైనపు బొమ్మ కొలువు తీరింది.
ఇక్కడ కూడా హృతిక్ రోషన్ రికార్డులు నమోదు చేస్తున్నాడు. ఈ మ్యూజియంలో అత్యంత ఎక్కవు ముద్దులు అందుకన్న టాప్ 10 లిస్టులో హృతిక్ రోషన్ బొమ్మ చేరింది. ఈ మ్యాజియం చూడటానికి వచ్చిన అభిమానులు హృతిక్ రోషన్ మైనపు బొమ్మను ముద్దులతో ముంచెత్తుతున్నారు. ఆ మ్యూజియంలో ఉన్న ఇతర బాలీవుడ్ స్టార్ల కన్నా హృతిక్ రోషన్ బొమ్ముకు ముద్దులు పెట్టడానికి ఇష్ట పడుత్నారు. మగాడు కాబట్టి మహిళా అభిమానులు ముద్దులు పెట్టుకోవడంలో పెద్దగా ఆశ్చర్య పడనక్కర్లేదు, కానీ మనోడికి మొత్తం ముద్దుల్లో 30 శాతం మగాళ్ల నుంచి వచ్చి పడుతున్నాయట. ఈ విషయంలో షారుఖ్, అమితాబ్, కరీనా, ఐశ్వర్యరాయ్ బొమ్మలు వెనక బడి పోవడం విశేషం. ఇంకే...మీ జేబులో డబ్బులుంటే లండన్ వరకు వెళ్లి పెట్టేయండి ముద్దు...


Click it and Unblock the Notifications











