లండన్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో మెరిసిన స్టార్ హీరో
లండన్ టుస్సాడ్ మ్యూజియంకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈమ్యూజియంలో చాలా మంది ప్రముఖుల మైనపు బోమ్మలను నెలకొల్పడం జరుగుతుంది. ఈమ్యూజియంలో ఇప్పటికే భారతదేశంలో ప్రముఖులైనటువంటి అమితాబ్ బచ్చన్, సచిన్ టెంటూల్కర్, షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ లాంటి వారి మైమపు బోమ్మలను చూశాం. ఇప్పుడు తాజాగా ఈజాబితాలోకి మరో ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటుడు మరోకరు చేరారు.
ఎవరా ఆబాలీవుడ్ స్టార్ అని అనుకుంటున్నారా..ఇంకెవరూ మన హృతిక్ రోషన్. గురువారం లండన్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మ వద్ద భార్య సుసానే, కుమారులతో ఫొటోలకు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక ఈ బాలీవుడ్ చిత్రం 'ధూమ్-2"లో హృతిక్ ఆహార్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ మైనపు బొమ్మను రూపొందించారు.


Click it and Unblock the Notifications











