బట్టల ప్రమోషన్ కోసమే విప్పేస్తున్నా, నన్ను బట్టలు వేసుకోనివ్వటం లేదు... ఎవరన్నారో చూస్తే ఆశ్చర్యమే

''నేను ఎప్పుడు నా స్టయిలిస్టును కలసినా కూడా.. సార్ మీరు ఎక్కువగా బట్టలు వేసుకున్నారు అంటారు". ఈ మాటలన్నది హృతిక్ రోషన్

ఇలాంటి స్టేట్ మెంట్ ఎవరో హీరోయిన్ ఇచ్చిందీ అంటే మామూలే కదా అనుకుంటాం గానీ "నాను వొంటిమీద ఎక్కువ బట్టలు ఉంచుకోవద్దంటున్నారు" అని ఒక హీరో చెప్పటం వింత గానే ఉంటుంది. ఇంతకీ ఈ మాటలన్నది హృతిక్ రోషన్ అయినా... దాదాపు ఇప్పుడు బాలీవుడ్ హీరోలంతా బాడీ షోకి అలవాటు పడి పోయారు.

సిక్స్ ప్యాక్ బాడీ తో మాచో మ్యాన్

సిక్స్ ప్యాక్ బాడీ తో మాచో మ్యాన్

90 ల్లో కేవలం సల్మాన్ మాత్రమే ఇలా ఉండేవాడు. అప్పటికి సిక్స్ ప్యాక్ బాడీ తో మాచో మ్యాన్ గా ఉన్న ఒకే ఒక్కడు సల్మాన్ ఖాన్ మాత్రమే. తన తొలినాళ్ళ సినిమా మైనే ప్యార్కియాలో చొక్క తీసెసిన సల్మాన్ తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేస్తూనే వచ్చాడు. ఇండియన్ కుర్రాళ్ళలో చాతీమీద వెంట్రుకలు కనిపించకుండా క్లీన్ గా ఉంచేయటం కూడా సల్మాన్ తోనే మొదలైయ్యిందని చెప్పుకోవాలి.

Recommended Video

Jr. NTR at No.1, Hritik Roshan in 2nd Place | Filmibeat Telugu
చొక్కా విప్పిపారేసేవాడు

చొక్కా విప్పిపారేసేవాడు

అడపాదడపా సినిమాల్లోనే అలా చేసినా తర్వాత స్టేజ్ షోలల్లో కూడా చొక్కా విప్పిపారేసేవాడు సల్మాన్... ఆ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే వస్తోంది. అయితే ఇప్పుడు పర్సనల్ డిజైనర్లే మరీ ఎక్కువ బట్టలు వేసుకోవద్దనే సలహాలు కూడా ఇస్తున్నారట. ''నేను ఎప్పుడు నా స్టయిలిస్టును కలసినా కూడా.. సార్ మీరు ఎక్కువగా బట్టలు వేసుకున్నారు అంటారు.

లేదు సార్ మీరు విప్పాల్సిందే అంటారు

లేదు సార్ మీరు విప్పాల్సిందే అంటారు

అదేంటయ్యా ఏముందని అంటే.. లేదు సార్ మీరు విప్పాల్సిందే అంటారు. నేను మాత్రం ఏమంటాను.. వారు చెప్పిందానికి కాదనలేనుగా'' అంటూ చక్కగానే చెప్పాడు గానీ. అసలే గ్రీకు వీరుడు అనిపిలిపించుకునే ఈ హీరో తన వంటిని కప్పేసుకు కూచోవాలని అనుకుంటాడా? ఏదో తన స్టయిలిస్టుల మీద సాకు చెప్పేసి ఇలా తన హాట్నెస్ ను చూపిస్తున్నాడు.

ఒక హిట్ అవసరం

ఒక హిట్ అవసరం

నిజానికి గతకొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు హృతిక్. గతసంవత్సరం వచ్చిన మొహంజో దారో, కాబిల్ లాంటి భారీ ఆశలు పెట్టుకున్న సినిమాలు కూడా దారుణం గా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఉన్న పోటీని తట్టు కోవటానికి హృతిక్ కి ఖచ్చితంగా ఒక హిట్ అవసరం.

తన కలల బ్రాండ్ బట్టల కోసం

తన కలల బ్రాండ్ బట్టల కోసం

ఈ మధ్యన ఈయన తండ్రి రాకేష్ రోషన్ మాత్రం క్రిష్-4 మీద వర్కు నడుస్తోందని చెప్పాడు. మొత్తానికి అటు సినిమాలు లేక పోవటం తో ఉన్నసమయాన్ని ఇలా బట్టలిప్పేసి తన టామీ హిల్‌ఫిగర్ బ్రాండ్ బట్టల కోసం ఫోజులు ఇస్తున్నాడు. అంటే బట్టల బ్రాండ్ ని ప్రమోట్ చేయటానికి కూడా వొంటి మీద బట్టలు విప్పేస్తున్నాడన్నమాట

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X