Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మగధీర’హిందీ రీమేక్ ఖరారు..డిటేల్స్
ముంబై : రాజమౌళి చిత్రాలు వరసగా హిందీలోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విక్రమార్కుడు చిత్రం అక్కడ రీమేక్ అయ్యి ఘన విజయం సాధించటంతో ఇప్పుడు బాలీవుడ్ దృష్టి 'మగధీర' పై పడింది. తెలుగులో భారీస్థాయి విజయాన్ని సాధించిన చిత్రం ''మగధీర''. మగధీర హక్కులను కొనుగోలు చేసిన నిర్మాత అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని బాలీవుడ్లో తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. అనురాగ్ కశ్యప్‌కు చెందిన నిర్మాణ సంస్థ ఫాంథమ్ మగధీర చిత్రాన్ని హిందీలో రూపొందించనుండగా ఈ సంస్థలో వికాస్ బెహల్, మధు మంతెన, విక్రమాదిత్య మోత్వానీలు భాగస్వామ్యులుగా ఉన్నారు.
ఇక ''ఢిల్లీ బెల్లి'' చిత్ర దర్శకుడు అభినయ్ దేవ్ హిందీలో రూపొందించనున్న మగధీర చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తారని వార్తలు రావడం తెలిసిందే. అలాంటిదేమీ లేదని రాజమౌళి వివరణ ఇచ్చారు. అలాగే చిత్రంలో రామ్ చరణ్ చేసిన పాత్రకు ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ బాగా సరిపోతారని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పేర్కొన్నారు. ఈగ హిందీ రీమేక్ మఖ్కీ చిత్రప్రచార కార్యక్రమం కోసం శనివారం ముంబైకి వచ్చిన ఆయన పైవిధంగా అన్నారు. ఇది ఈ నెల 12న విడుదల కానుంది.
మగధీర సినిమాను హిందీలో పునర్నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాను ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోనని ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు. నిజానికి ఇది మాస్ సినిమా అని, ఎవరైనా హీరో పాత్రకు సరిపోతారన్నారు. బాలీవుడ్లో మాత్రం ఓ హిందీ చిత్రానికి దర్శకత్వం వహించాలని ఉందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ మంచి కథ లభిస్తే త్వరలోనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని చెప్పారు. ఈగ (మఖ్కీ) హిందీలోనూ ఘన విజయం సాధిస్తుందన్నారు.