twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మగధీర’హిందీ రీమేక్ ఖరారు..డిటేల్స్

    By Srikanya
    |

    ముంబై : రాజమౌళి చిత్రాలు వరసగా హిందీలోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విక్రమార్కుడు చిత్రం అక్కడ రీమేక్ అయ్యి ఘన విజయం సాధించటంతో ఇప్పుడు బాలీవుడ్ దృష్టి 'మగధీర' పై పడింది. తెలుగులో భారీస్థాయి విజయాన్ని సాధించిన చిత్రం ''మగధీర''. మగధీర హక్కులను కొనుగోలు చేసిన నిర్మాత అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. అనురాగ్ కశ్యప్‌కు చెందిన నిర్మాణ సంస్థ ఫాంథమ్ మగధీర చిత్రాన్ని హిందీలో రూపొందించనుండగా ఈ సంస్థలో వికాస్ బెహల్, మధు మంతెన, విక్రమాదిత్య మోత్వానీలు భాగస్వామ్యులుగా ఉన్నారు.

    ఇక ''ఢిల్లీ బెల్లి'' చిత్ర దర్శకుడు అభినయ్ దేవ్ హిందీలో రూపొందించనున్న మగధీర చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తారని వార్తలు రావడం తెలిసిందే. అలాంటిదేమీ లేదని రాజమౌళి వివరణ ఇచ్చారు. అలాగే చిత్రంలో రామ్ చరణ్ చేసిన పాత్రకు ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ బాగా సరిపోతారని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పేర్కొన్నారు. ఈగ హిందీ రీమేక్ మఖ్కీ చిత్రప్రచార కార్యక్రమం కోసం శనివారం ముంబైకి వచ్చిన ఆయన పైవిధంగా అన్నారు. ఇది ఈ నెల 12న విడుదల కానుంది.

    మగధీర సినిమాను హిందీలో పునర్‌నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాను ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోనని ఎస్‌ఎస్ రాజమౌళి చెప్పారు. నిజానికి ఇది మాస్ సినిమా అని, ఎవరైనా హీరో పాత్రకు సరిపోతారన్నారు. బాలీవుడ్‌లో మాత్రం ఓ హిందీ చిత్రానికి దర్శకత్వం వహించాలని ఉందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ మంచి కథ లభిస్తే త్వరలోనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని చెప్పారు. ఈగ (మఖ్కీ) హిందీలోనూ ఘన విజయం సాధిస్తుందన్నారు.

    English summary
    Renowned Telugu film director S S Rajamouli, whose one of the superhit films 'Magadheera' is set to be remade in Hindi, says actor Hrithik Roshan would be the “best choice” to play the lead role in the Hindi version. 'Magadheera' is a 2009 Telugu historical drama directed by Rajamouli. The film starring Ram Charan Teja and Kajal Aggarwal in the lead roles, was a huge hit down south.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X