»   » బలిపశువునయ్యా.... నాలుగేళ్లుగా వేధింపులే: కంగనా వివాదంపై మౌనం వీడిన హృతిక్ రోషన్

బలిపశువునయ్యా.... నాలుగేళ్లుగా వేధింపులే: కంగనా వివాదంపై మౌనం వీడిన హృతిక్ రోషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Hrithik Roshan Responded About The Relationship With Kangana Ranaut

గత నాలుగేళ్లుగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య జరుగుతున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. హృతిక్ తన మాజీ ప్రియుడని, అతడు తనతో గతంలో ప్రేమ వ్యవహారం నడిపాడంటూ కంగనా ఆరోపించడం, ఈ విషయంలో అనేక ఈమెయిల్స్ లీక్ కావడం బాలీవుడ్లో సంచలనం.

ఇన్నాళ్లుగా ఈ వ్యవహారంలో మీడియాలో చాలా రభస జరుగుతున్నా హృతిక్ రోషన్ మాత్రం ఏనాడూ స్పందించలేదు. తాజాగా కంగన వ్యవహారంపై మరోసారి మీడియాలో దుమారం రేగడంతో హృతిక్ రోషన్ మౌనం వీడిచారు. సోషల్ మీడియా ద్వారా తన స్టేట్మెంట్ విడుదల చేశారు.

అందుకే ఇపుడు స్పందిస్తున్నాను

అందుకే ఇపుడు స్పందిస్తున్నాను

వివాదం గురించి ఇప్ప‌టి వ‌ర‌కు తాను మాట్లాడ‌క‌పోవ‌డంతో ఇంకా ఇది కొన‌సాగుతోందని, ఇప్పుడైనా మాట్లాడ‌క‌పోతే నిజానిజాల‌ను అపార్థం చేసుకునే అవ‌కాశం ఉండ‌టంతో తాను స్పందిస్తున్నట్లు హృతిక్ రోషన్ తన స్టేట్మెంట్ లో పేర్కొన్నారు.

ఇదో పెద్ద సమస్యగా మారింది

ఇదో పెద్ద సమస్యగా మారింది

నేనెప్పుడూ సృజ‌నాత్మ‌క‌, నిర్మాణాత్మ‌క ప‌నులపైనే దృష్టి సారిస్తాను. అవి కాకుండా మిగ‌తా విష‌యాల‌ను ప‌ట్టించుకోను. అలా ప‌ట్టించుకోకుండా ఉండ‌టమే ఈ స‌మ‌స్య‌ను సృష్టించింది. కొన్నిసార్లు చిన్న అనారోగ్య‌మే పెద్ద జ‌బ్బుగా మారే అవ‌కాశం ఉంది. వీలైనంత త్వ‌ర‌గా దానికి చికిత్స చేయాలి. ఇప్పుడు ఈ స‌మ‌స్య నాకు పెద్ద జ‌బ్బుగా మారింది.... అని హృతిక్ చెప్పుకొచ్చారు.

ఆమెను ఎప్పుడూ కలవలేదు

ఆమెను ఎప్పుడూ కలవలేదు

నాకు ఎలాంటి సంబంధంలేని విష‌యంలో నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. నా ప్ర‌మేయం లేకుండానే న‌న్ను ఈ వివాదంలోకి లాగారు. అస‌లు నిజం ఏంటంటే... నేను అస‌లు ఆ మ‌హిళ(కంగనా)ను క‌ల‌వ‌నేలేదు. మేం ఇద్ద‌రం ఒకే సినిమాలో న‌టించి ఉండొచ్చు. కానీ వ్య‌క్తిగ‌తంగా మేమెప్పుడూ క‌లుసుకోలేదు.... అని హృతిక్ చెప్పుకొచ్చారు.

నాలుగేళ్లుగా వేధింపులు

నాలుగేళ్లుగా వేధింపులు

నాకు సంబంధం లేని విషయంలో నేను నాలుగేళ్లుగా వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నాను. ఒక సినిమా విషయంలో తప్ప మేమెప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. నేను మంచి వాడిన‌ని నిరూపించుకోవ‌డానికి ఇలా చెప్ప‌డం లేదు. న‌న్ను న‌మ్మండి. భ‌విష్య‌త్తులో ఈ వివాదం వ‌ల్ల క‌లిగే స‌మ‌స్య‌ల నుంచి త‌ప్పించుకోవ‌డానికే ఇలా చెబుతున్నాను` అని హృతిక్ తెలిపారు.

 `అమ్మాయిలు మంచి వాళ్లు.. మ‌గాళ్లదే త‌ప్పంతా` అనుకుంటూ

`అమ్మాయిలు మంచి వాళ్లు.. మ‌గాళ్లదే త‌ప్పంతా` అనుకుంటూ

`దుర‌దృష్ట‌వ‌శాత్తు నిజాన్ని తెలుసుకోవ‌డానికి ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. `అమ్మాయిలు మంచి వాళ్లు.. మ‌గాళ్లదే త‌ప్పంతా` అనే ఒక నమ్మకం మన సమాజంలో ఉంది. త‌రాల నుంచి ఆడ‌వాళ్లు వేధింపుల‌కు గుర‌వుతున్నమాట నిజమే. అంత‌మాత్రాన ఆడ‌వాళ్లు మంచివాళ్లు.. మ‌గాళ్లు చెడ్డ‌వాళ్లు అని స్ప‌ష్టంగా చెప్ప‌లేమని... హృతిక్ తన స్టేట్మెంటులో పేర్కొన్నారు.

అది పచ్చి అబద్దం

అది పచ్చి అబద్దం

2014లో పారిస్‌లో ఆమెకు ప్రపోజ్ చేసినట్లు ఫొటోషాప్ ద్వారా సృష్టించిన ఒక్క ఫొటో మిన‌హా ఈ వివాదానికి సంబంధించి ఎలాంటి ఆధారం లేదు. ఆ ఫొటో విడుద‌లైన మ‌రుస‌టి రోజే అది అబ‌ద్ధ‌మ‌ని నా శ్రేయోభిలాషులు, నా భార్య అర్థం చేసుకున్నారు. 2014లో నా పాస్‌పోర్టు వివ‌రాలు చూసుకోండి. ఆ మ‌ధ్య కాలంలో నేను ఎలాంటి ప్ర‌యాణాలు చేయ‌లేదు.... అని హృతిక్ వివరణ ఇచ్చుకున్నారు.

ఆమెను కించపరచడం ఇష్టంలేకనే

ఆమెను కించపరచడం ఇష్టంలేకనే

ఈ విష‌యాలు నేను ముందే చెప్పి ఉండొచ్చు. కానీ ఆ మ‌హిళ‌ను కించ‌ప‌రచ‌డం ఇష్టం లేక మౌనంగా ఉన్నాను... అని హృతిక్ పేర్కొనడం గమనార్హం.

ఈ విషయం అందరూ గుర్తించాలి

ఈ విషయం అందరూ గుర్తించాలి

ఈ-మెయిళ్లు ఎవ‌రు పంపార‌నే సంగ‌తి సైబ‌ర్ క్రైమ్ శాఖ తేల్చుతుంది. నేను నా ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల‌ను పోలీసుల‌కు ఇచ్చాను. మ‌రి అవ‌త‌లి వాళ్లు(కంగనా) త‌మ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల‌ను పోలీసుల‌కు ఇవ్వ‌డానికి ఎందుకు నిరాక‌రిస్తున్నార‌నో అందరూ గుర్తించాలి... అని హృతిక్ పేర్కొన్నారు.

బలిపుశువుగా మారాను

బలిపుశువుగా మారాను

ఈ వివాదాన్ని ప్రేమ వ్య‌వ‌హారంగా మాత్రం చిత్రీక‌రించొద్దు. ఇప్ప‌టి వ‌ర‌కు దీని వ‌ల్ల నేను ఎదుర్కున్న స‌మ‌స్య‌లు చాలు. స‌మాజంలో ఆడ‌వాళ్ల మీద ఉన్న మంచి అభిప్రాయం కార‌ణంగా నేను బ‌లిప‌శువుగా మారాను. అలాగ‌ని నాకు కోపం లేదు, అసలు రాదు కూడా.... అంటూ హృతిక్ వ్యాఖ్యానించారు.

నా కుటుంబం మీద పడొద్దనే

నా కుటుంబం మీద పడొద్దనే

ఈ వివాదానికి సంబంధించిన ప్రభావం నా కుటుంబం, పిల్ల‌లు, స‌మాజం మీద పడొద్దని కోరుకుంటున్నాను. నా వల్ల ఒక సమస్య తెరపైకి రావడం, ఎవరైనా ఇబ్బంది పడటం నాకు ఇష్టం ఉండదు అని హృతిక్ రోషన్ పేర్కొన్నారు.

English summary
Hrithik Roshan has tweeted a lengthy statement about the feud with Kangana Ranaut that has hogged headlines for a year-and-a-half now. The 43-year-old actor claims that he never spent any time alone with Kangana - they starred in Kites and Krrish 3 - and that he has been 'harassed' by the actress over the last four years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu