ఈ అభిమాని చాలా చాలా లక్కీ...! (ఫోటోలు)
ముంబై: తమ అభిమాన హీరోను ప్రత్యక్షంగా చూడటమే ఎంతో గొప్పగా భావిస్తుంటారు అభిమానులు. ఇక ఆ హీరోతో చేయి కలిపే అవకాశం వస్తే వాళ్లు చాలా లక్కీ. కానీ తమ అభిమాన హీరోనే తమను రెండు చేతులతో ఎత్తుకుంటే......చాలా చాలా లక్కీ కదూ. తాజాగా అలాంటి లక్కీచాన్స్ వరించింది బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అభిమానికి!
త్వరలో విడుదల కాబోతున్న హృతిక్ 'క్రిష్ 3' మూవీ ప్రమోషన్లో భాగంగా స్మార్ట్ ఫోన్ల కోసం క్రిష్ 3 గేమ్ రూపొందించారు. ఈ గేమ్‌ను ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో అట్టహాసంగా విడుదల చేసారు. బెంగుళూరులోని దయానంద సాగర్ ఇనిస్టిట్యూషన్లో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది హృతిక్ రోషన్ అభిమానులు హాజరయ్యారు.
కొందరు అక్కీ ఫ్యాన్స్ హృతిక్‌తో కలిసి ఆ గేమ్ ఆడే అవకాశం దక్కించుకున్నారు. అయితే సుస్మితా అనే అమ్మాయికి మరింత లక్కీ చాన్స్ దక్కింది మారింది. హృతిక్ ఆమెను ఎత్తుకుని ఆశ్చర్యపరిచాడు. కిష్ 3 గేమ్ విషయానికొస్తే...ఈ గేమ్ ఆండ్రాయిడ్, విడోస్ ఫోన్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలతో నడిచే ఫోన్లలో పని చేస్తుంది.
స్లైడ్ షోలో ఈ గేమ్ విడుదల కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో చూద్దాం......

లక్కీ ఫ్యాన్
సుస్మితా అనే ఈ అమ్మాయి ఎంతో లక్కీ అయినా....ఆమెతో పాటు అక్కడకు చేరుకున్న హృతిక్ రోషన్ అభిమానులు అంటున్నారు. హృతిక్ తనను ఎత్తుకోవడంతో ఆమె ఎంతో ఆశ్చర్యానికి లోనైంది.

వెలకట్టలేని ఆనందం
హృతిక్ రోషన్ తనను క్యారీ చేయడంపై సుస్మిత స్పందిస్తూ......ఆ సమయంలో తాను ఎంతో ఆనందానికి లోనయ్యానని, ఆ ఆనందం వెలకట్టలేనిది అని చెప్పింది. అభిమానికి ఇంతకు మించిన ఆనందం ఉండదు అని అంటోంది.

క్రేజీ జనాలు
హృతిక్ రోషన్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా వీరిలో ఎక్కువ మంది కాలేజీ అమ్మాయిలే ఉండటం గమనార్హం. హృతిక్ అంటే ఎంత క్రేజీనో ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతోంది.

గేమ్ ఆన్
గేమ్ విడుదల సందర్భంగా ఓ అభిమాని ఇలా హృతిక్‌తో కలిసి ఆ గేమ్ ఆడే అవకాశం దక్కించుకున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

క్యాజువల్‌గా వచ్చిన హృతిక్
ఈ కార్యక్రమానికి హృతిక్ రోషన్ క్యాజువల్ దుస్తువుల్లో హాజరయ్యారు. కాలేజీ ఎన్విరాల్మెంటుకు తగిన విధంగా జీన్స్, టీ షర్ట్, స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుని ఆయన దర్శనమిచ్చారు.

కట్టుదిట్టమైన భద్రత
భారీగా అభిమానులు తరలి రావడంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా భారీగా భద్రత ఏర్పాటు చేసారు. హృతిక్‌ను ఎవరూ చుట్టుముట్టకుండా తగిన ఏర్పాటు చేసారు.

అమ్మాయిల ఆనందం
తమ అభిమాన హీరోను కలిసే అవకాశం రావడంతో పలువురు పలువురు ఫిమేల్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. హృతిక్‌ను కలిసి తమ ముచ్చట తీర్చుకున్నారు.


Click it and Unblock the Notifications











