చిరంజీవిని చూసి షాకయ్యా.. ఆయన ప్రవర్తన ఇలా ఉంటుందనుకోలేదు.. హృతిక్ రోషన్ కామెంట్స్

టాలీవుడ్ రారాజు మెగాస్టార్ చిరంజీవి ప్రవర్తన చూసి షాకయ్యానని అంటున్నారు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. టాలీవుడ్ టు బాలీవుడ్ అందరు హీరోలకెల్లా ఆయన ప్రత్యేకం అని చెబుతున్నారు. హృతిక్ రోషన్ నటించిన వార్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన చిరు ప్రవర్తనపై కొన్ని కామెంట్స్ చేశారు. ఆ వివరాలు చూద్దామా..

తెలుగు హీరోలంతా.. అందునా చిరు

తెలుగు హీరోలంతా.. అందునా చిరు

తనకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టమని పేర్కొన్న హృతిక్.. తెలుగు హీరోల పనితీరు, చూపే అభినయం బాగా నచ్చుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటన తనకు చాలా ఇష్టమని అన్నారు. చిరు సర్‌ని చాలా సార్లు కలిశానని, ఆయనలోని సింప్లిసిటీ ముందు ఎవ్వరూ సాటిరారని చెప్పారు.

 ఒకానొక సందర్భంలో చిరు ప్రవర్తన

ఒకానొక సందర్భంలో చిరు ప్రవర్తన

ఓ సారి ఐఫా అవార్డ్ వేడుకలను తాను హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. ఆ వేడుకకు చిరు కూడా హాజరయ్యారని, అప్పుడు ఆయన ప్రవర్తన ఆశ్చర్యం కలిగించిందని హృతిక్ అన్నారు. ఆ వేడుకకు వచ్చిన ఇతర సెలబ్రిటీల వద్దకు స్వయంగా చిరుని వెళ్లి పలకరించడం చూసి తాను షాకయ్యానని పేర్కొన్నారు. ఆయన ప్రవర్తన టాలీవుడ్ కల్చర్ ఎలా ఉంటుందో తెలియజేసిందని ఈ సందర్బంగా ఆయన చెప్పారు.

హృతిక్ రోషన్ 'వార్'

హృతిక్ రోషన్ 'వార్'

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ - యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా ‘వార్'. ఈ సినిమాను సిద్దార్ద్ ఆనంద్ డైరెక్ట్ చేశారు. యస్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాలో వాణీ కపూర్ నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగుతో పాటు మరికొన్ని చిత్రాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అదే రోజు చిరంజీవి 'సైరా'

అదే రోజు చిరంజీవి 'సైరా'

మరోవైపు అదే అక్టోబర్ 2 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' విడుదల కానుండటం విశేషం. ఫ్యాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న ఈ సినిమా హృతిక్ రోషన్ 'వార్' సినిమాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

'సైరా నరసింహా రెడ్డి' మూవీ

'సైరా నరసింహా రెడ్డి' మూవీ

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 1857 బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ వేసి ఈ మూవీ రూపొందించడం జరిగింది. చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో గ్రాండ్‌గా అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X