హృతిక్ రోషన్ పేరుతో అమ్మాయి న్యూడ్ ఫోటోలు
ముంబై: సినిమా రంగంలో ఉండే వారికి సెలబ్రిటీ హోదాతో పాటే....కొన్ని ఇబ్బందులు వెంటాడుతూనే ఉంటాయి. ఈ కంప్యూటర్ కాలంలో ఇంటర్నెట్ ద్వారా లెక్కలేనన్ని సమస్యలు వారికి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ను ఫేక్ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఆయన అఫీషియల్ ఈమెయిల్ ఐడీని పోలి ఉన్న సదరు అకౌంట్ ద్వారా అమ్మాయిల న్యూడ్ ఫోటోలు, వీడియోలు పంపుతున్నారట.

ఈ విషయం హృతిక్ రోషన్ తెలుసుకుని ముంబై పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేసారు. తన అఫీషియల్ ఈమెయిల్ [email protected] ను పోలి ఉండేలా[email protected] పేరుతో ఫేక్ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసి తన పేరుతో ఆన్ లైన్ మోసానికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసారు.
సదరు ఫేక్ అకౌంట్ ద్వారా అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలో పంపుతున్నారని, ఈ కారణంగా తన ఇమేజ్ స్పాయిల్ అవుతోందని, వెంటనే నిందితులను కనిపెట్టాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హృతిక్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తన పేరుతో ఉన్న ఫేక్ ఇమెయిల్ ఐడీని నమ్మొద్దని అభిమానులకు పిలుపునిచ్చారు హృతిక్.


Click it and Unblock the Notifications











