»   » మాజీ భార్య కోసం, కళ్ళు తిరిగే గిఫ్ట్, ఇక్కడ పవన్ అక్కడ అతను

మాజీ భార్య కోసం, కళ్ళు తిరిగే గిఫ్ట్, ఇక్కడ పవన్ అక్కడ అతను

Posted By:
Subscribe to Filmibeat Telugu

భార్య సుజానె నుంచి విడిపోయినా కూడా హృతిక్‌ ఆమెను తరచూ ఏదో విధంగా కలుస్తునే ఉన్నాడు. పిల్లల కోసం ఆమెతో కలిసి ఔటింగ్స్‌కి వెళ్ళడం, పార్టీలు చేసుకోవడం చేస్తూనే ఉన్నాడు. ఇవన్నీ చూసి హృతిక్‌ సుజానెకు మళ్ళీ దగ్గరవుతున్నాడని బాలీవుడ్‌ జనాలు అన్నా, ఆ మాటలను హృతిక్‌ కొట్టిపారేశాడు. పిల్లల కోసమే తనతో మాట్లాడుతున్నాను తప్ప తిరిగి కలిసే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు మాజీ భార్యకి 25 కోట్లతో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ కొనిచ్చాడు. ఈ బందం బాలీవుడ్ జనాలకి ఎప్పుడూ వింతగానే కనిపిస్తుంది...

చిన్నతనం నుంచే

చిన్నతనం నుంచే

నాలుగేళ్ల పాటు ప్రేమించుకొని, పదమూడేళ్లపాటు వైవాహిక జీవితాన్ని గడిపి, ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యాక హృతిక్‌ రోషన్‌, సుజానే ఖాన్‌ విడిపోవడం కూడా ఆ కోవలోనిదే. ఇద్దరివీ సినీ కుటుంబాలు కావడం వల్ల చిన్నతనం నుంచే ఆ ఇద్దరూ ఒకరికి ఒకరు తెలుసు.

2000 సంవత్సరంలో పెళ్ళి

2000 సంవత్సరంలో పెళ్ళి

2000 సంవత్సరంలో పెళ్లాడటానికి ముందు నాలుగేళ్ల పాటు ఆ ఇద్దరూ ప్రేమపక్షులై విహరించారు. పెళ్లయిన ఆరేళ్లకు రెహాన్‌, ఎనిమిదేళ్లకు హృదాన్‌ పుట్టారు. ఆ తర్వాత కూడా బహిరంగంగా తమ మధ్య ప్రేమను దాచుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించని ఆ ఇద్దరూ అందరికీ దిగ్ర్భాంతిని కలిగిస్తూ 2013 డిసెంబర్‌లో విడిపోతున్నట్లు ప్రకటించారు.

పెళ్లి బంధాన్ని నేనెంతో గౌరవిస్తాను

పెళ్లి బంధాన్ని నేనెంతో గౌరవిస్తాను

‘‘ఇది నా అభిమానులకూ, పెళ్లి అనే బంధానికీ అత్యంత విలువనిచ్చేవాళ్లకూ ఈ వార్త కలవరాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. పెళ్లి బంధాన్ని నేనెంతో గౌరవిస్తాను. అయితే నా నుంచి విడిపోవాలనీ, మా పదిహేడేళ్ల అనుబంధాన్ని ముగించాలనీ సుజానే నిర్ణయించుకుంది.

ప్రేమ నాతోనే ఉంటుంది

ప్రేమ నాతోనే ఉంటుంది

నా తదుపరి జీవితంలోనూ సుజానే అందించిన ప్రేమ నాతోనే ఉంటుంది. నేను లేకుండా ఆమె ముఖంలో నవ్వులు మరింతగా విరబూస్తాయంటే, ఎలాంటి నిబంధనలూ లేకుండా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఇది ప్రేమకు నేను పలికే గొప్ప నీరాజనం'' అని అప్పట్లో తెలిపాడు హృతిక్‌. ఇప్పుడు ఆ ఆద్దరూ తమ అనుబంధానికి చెక్‌పెట్టి, చట్టపరంగా విడాకులు తీసుకున్నారు.

ఊహించని బహుమతి

ఊహించని బహుమతి

రీసెంట్ గా సుజానేను కలిసినపుడు.. హృతిక్.. ఊహించని బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడని.. ఓ ఫ్రెండ్ గా సుజానే అంటే తనకు ఎంత అభిమానమో చాటుకున్నాడనీ.. బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తన ఇంటికి అతి దగ్గర్లో.. సుజానే తల్లిదండ్రుల ఇంటికి దగ్గర్లో.. ఓ మాంచి ఫ్లాట్ ను.. హృతిక్ సుజానేకు గిఫ్ట్ గా ఇచ్చాడట. పిల్లలతో పాటు హాయిగా జీవించేలా అన్ని సౌకర్యాలు ఆ ఫ్లాట్ లో ఉన్నాయట. ఈ అన్ ఎక్స్ పెక్టెడ్ గిఫ్ట్ కు.. సుజానే కూడా థ్రిల్ గా ఫీలయిందట.

హృతిక్‌ ఇంటికి సమీపంలోనే

హృతిక్‌ ఇంటికి సమీపంలోనే

ఈ ఫ్లాట్‌ కూడా హృతిక్‌ ఉంటున్న ఇంటికి అతి సమీపంలోనే ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. వీరిద్దరూ తిరిగి కలవబోతున్నారన్న రూమర్లకు సుజానె గట్టిగానే బదులిస్తోంది. తామిద్దరం తిరిగి కలవడం అన్నది జీవితంలో జరగదని స్పష్టం చేసింది. మేం ఇప్పటికి మంచి స్నేహితులం మాత్రమే అంటోంది. అంటే స్నేహితురాలికి అంత ఖరీదైన గి‌ఫ్టు ఎవరైనా ఇస్తారా? అన్న ప్రశ్నకు మాత్రం సుజానె జవాబు ఇవ్వడం లేదట!

కలిసి జీవించే అవకాశం లేకున్నా

కలిసి జీవించే అవకాశం లేకున్నా

దీంతో.. ఓవరాల్ గా.. ఇద్దరూ మళ్లీ కలిసి జీవించే అవకాశం లేకున్నా.. స్నేహాన్ని మాత్రం కలిసి కొనసాగిస్తారన్న నమ్మకం కలిగిందని అంతా అంటున్నారు. పిల్లల కోసం మనస్పర్థలు పక్కన పెట్టిన ఈ ఇద్దరూ.. ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు. టాలీవుడ్ లో పవన్ కళ్యాన్ కూడా రేణూ దేశాయ్ తో చట్టప్రకారం విడి పోయినా పిల్లల కోసం తండ్రిగా తన భాధ్యత తాను నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా హీరోలు కొన్ని విషయాల్లో ఆదర్షంగా నిలవటం హర్షనీయమే.

English summary
A report in Mumbai Mirror stated that the ‘Kaabil’ actor has purchased a new apartment for Sussanne and his kids, which is just about 15 minutes away from his house.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu