»   » హీరోయిన్ యామీ గౌతమ్‌పై ప్రముఖ హీరో ఫైర్.. ఆమె ఏమైనా దేవతనా?

హీరోయిన్ యామీ గౌతమ్‌పై ప్రముఖ హీరో ఫైర్.. ఆమె ఏమైనా దేవతనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కు తనతో నటించిన హీరోయిన్లతో చేదు అనుభవం ఎదురవుతున్నది. ఇటీవల కంగన రనౌత్, తాజాగా యామీ గౌతమ్‌తో ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. యామీ ప్రవర్తించిన తీరుపై హృతిక్ మండిపడుతున్నాడు. హృతిక్, యామీ ఈ మధ్య విడుదలైన కాబిల్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

యామీ తీరుపై హృతిక్ మండిపాటు

యామీ తీరుపై హృతిక్ మండిపాటు

కాబిల్ చిత్ర విజయాన్ని పురస్కరించుకొని నిర్మాత, దర్శకుడు రాకేశ్ రోషన్, హృతిక్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి కాబిల్ చిత్రంలో నటించిన యామీ గౌతమ్‌ను ఆహ్వానించారు. ఆ సమావేశానికి యామీ ఆలస్యంగా రావడం కాకుండా చాలా విచిత్రంగా వ్యవహరించడంపై హృతిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గంట లేటుగా..

గంట లేటుగా..

ముంబైలో రాకేశ్ రోషన్‌తోపాటు చిత్ర యూనిట్‌లోని కొందరిని ఈ మీడియా భేటీకి ఆహ్వానం పంపారు. యామీని సాయంత్రం 6 గంటలకు రావాల్సిందిగా కోరారు. అయితే నిర్ణీతీ సమయానికి యామీ రాలేదట. ఫోన్ చేస్తే నెటవర్క్ పరిధిలో లేదనే సమాచారం వచ్చిందట. మీడియాతోపాటు హృతిక్, రాకేశ్ చాలా సేపు ఎదురుచూశారట.

యామీ లేకుండానే..

యామీ లేకుండానే..

చేసేది ఏమిలేక యామీ లేకుండా హృతిక్ ఫ్యాన్స్‌తో ఫోటోలు దిగడం లాంటివి చేశారు. దాదాపు 7 గంటల ప్రాంతంలో వేదిక వద్దకు చేరుకొన్న యామీ.. లేట్ అయినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేకపోగా.. స్టార్ హీరోయిన్‌గా, ఓ దేవతగా బిల్డప్ ఇచ్చిందట. రాకేశ్, హృతిక్‌ను కూడా సరిగా పట్టించుకోలేదట. ఇలా ప్రవర్తించిన యామీపై హృతిక్ అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడట.

కొద్ది సేపటికే నిష్క్రమించే ప్రయత్నం..

కొద్ది సేపటికే నిష్క్రమించే ప్రయత్నం..

నేరుగా వేదిక ఎక్కి హృతిక్, రాకేశ్‌తో ఫొటోలు దిగడం ప్రారంభించింది. మీడియా సమావేశం పూర్తి కాగానే ఫొటోలు దిగి అక్కడి నుంచి నిష్క్రమించే ప్రయత్నం చేయడం హృతిక్ను ఇంకా మండిపడేలా చేసింది.
తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని మీడియా ముందు ప్రదర్శించలేక హృతిక్ కోపంతో మీడియా సమావేశం నుంచి బయటకు వెళ్లినట్టు సమాచారం.

English summary
Hrithik Roshan may have been smitten with Yami Gautam in their last release, Kaabil, two actors were supposed to attend a meet-and-greet with Rakesh Roshan. but Yami came late for event and behaved like diva attitude.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu