twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండు ఒకేసారి రిలీజ్ ..ఇల్లీగల్ కాదు కానీ అనైతికం,వందకోట్లు నష్టం

    షారూఖ్ ఖాన్ సినిమాతో పోటీ పడటం విషయమై హీరో హృతిక్ రోషన్ మాట్లాడారు.

    By Srikanya
    |

    ముంబై: రెండు భారీ సినిమాలు ఒకేసారి భాక్సాఫీస్ వద్ద పోటీ పడటం ఈ రోజున కొత్తగా ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్నదేమీ కాదు. చాలా సార్లు జరిగింది, ఇంకా జరగబోతోంది. ఎవరూ వెనక్కి తగ్గని పరిస్దితుల్లో అలాంటి సిట్యువేషన్స్ వస్తూంటాయి. తెలుగులో రెండు భారీ చిత్రాలు గౌతమి పుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 ఒకే సీజన్ లో రోజు తేడాలో విడుదల అవుతున్నాయి. బాలీవుడ్ లో అయితే ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కు పెట్టుకున్నాయి. ఆ సినిమాలు 'కాబిల్‌' , 'రయీస్‌'.

    జనవరి 25న బాక్సాఫీస్‌ దగ్గర క్లాష్‌ కాబోతున్న రెండు సినిమాల అర్థాలు భలేగా ఉన్నాయి. 'కాబిల్‌' అంటే సమర్థత, 'రయీస్‌' అంటే ప్రసిద్ధత. పేర్లకు తగినట్లే ఈ రెండు సినిమాలు ఇద్దరు యోగ్యులైన ప్రసిద్ధులవే.

    ఈ రెండు సినిమాలు హీరోలలో ఒకరు గ్రీకు గాడ్‌ హృతిక్‌ రోషన్‌ అయితే, మరొకరు బాలీవుడ్‌ కింగ్‌ షారుఖ్‌ ఖాన్‌. కాబిల్‌ సినిమాను హృతిక్‌ తండ్రి రాకేశ్‌ రోషన్‌ నిర్మించగా, రయీస్‌ సినిమాను షారుఖ్‌ భార్య గౌరి నిర్మించింది. షారుఖ్‌ అభిమానులు రయీస్‌ ముందు కాబిల్‌ నిలవలేదని, మొహంజొదారోలాగే కొట్టుకు పోతుందని ప్రచారం చేయటం వలననే రాకేశ్‌ రోషన్‌ వెనక్కి వెళ్లకుండా అలాగే రిలీజ్ డేట్ ని వెనక్కి మార్చలేని సిట్యువేషన్ లో ఉన్నారు.

    Hrithik Roshan opens up about Kaabil, clash with Raees

    అసలు కాబిల్‌ సినిమా 26న అంటే గణతంత్ర దినోత్సవం రోజున విడుదల కావాలి. రాకేశ్‌ రోషన్‌ కొంచెం సర్దుకొని విడుదల తేదీని ఒకరోజు ముందుకు, అంటే 25కు మార్చుకున్నాడు. షారుఖ్‌ సినిమా కూడా వెంటనే 26 నుంచి 25కు మారింది. ఇది కేవలం ఇగో క్లాష్‌ అని బాలీవుడ్ సినీ పండితులు అంటున్నారు. ఇంత జరుగుతున్నా హృతిక్‌ మాత్రం ఎప్పుడూ పెదవి విప్పలేదు. కానీ ఇప్పుడు వ్యాఖ్యానించేందుకు ముందుకు వచ్చాడు.

    హృతిక్ మాట్లాడుతూ..'రెండు సినిమాలకు ఒకే రోజు విడుదల చేయడం చట్ట వ్యతిరేకం కాదు... కానీ అనైతికం. ఈ సంఘటన భావితరాలకు కనువిప్పు కావాలి. హాలీవుడ్‌ చిత్రరంగంలో నీతిబాహ్యమైన సంఘటనలు చోటు చేసుకోవు.

    బ్యాట్‌మ్యాన్‌ సినిమాతో సూపర్‌మ్యాన్‌ సినిమా కానీ, లార్డ్‌ ఆఫ్‌ రింగ్స్‌ తో హ్యారీ పోటర్‌ సినిమా కానీ పోటీ పడలేదు. భగవంతుడి దయతో మా రెండు సినిమాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. విజయవంతమైతే ఇరు కుటుంబాల వాళ్లు సంబరం చేసుకుంటాం. అయితే ఈ బాక్సాఫీస్‌ క్లాష్‌ వలన వంద కోట్లు నష్టపోతాం' అంటూ వ్యాఖ్యానించాడు.

    అలాగే హృతిక్ కంటిన్యూ చేస్తూ.. " చూడండి, అలా వచ్చేసింది, క్లాష్ వస్తే ఏం చెయ్యగలం, వాళ్ళకు సరైన డేట్ దొరికి ఉండకపోవచ్చు. దీని గురించి ఎక్కువ ఆలోచించటం టైమ్ వేస్ట్. నా చేతిలో లేని విషయాలు గురించి నేను ఎక్కువ ఆలోచించి ఉపయోగం లేదు. మేము చెయ్యగలిగింది చేసాం. షారూఖ్ ఖాన్ కూడా తన సినిమాని గొప్పగానే రూపొందించి ఉండి ఉంటారు." అన్నారు.

    "అలాగే కేవలం ఈ క్లాష్ అనేది బిజినెస్ వరకే కానీ స్నేహానికి కాదనేది గుర్తించాలి. షారూఖ్ తో నా స్నేహం కొనసాగుతుంది. బిజినెస్ ఎంతవరకో అంతవరకే. ఇలా మరో పెద్ద సినిమాతో క్లాష్ అవటం మొదటిసారి. నేను ఎంజాయ్ చేస్తున్నా," అన్నారు.

    English summary
    Raees and Kaabil can clash but the friendship and business should not clash. Once you got that sorted out then you’re at peace. Everything teaches you something and every experience is a good experience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X