శ్రీదేవితో నటించడానికి భయపడ్డానన్న హృతిక్ రోషన్..ఆమె ఏంచేసిందంటే!
బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ సినీ ప్రయాణం మొదలైంది శ్రీదేవితోనే. బాలనటుడిగా శ్రీదేవి పక్కన తొలి షాట్ లో నటించానని హృతిక్ తెలిపాడు. శ్రీదేవి మరణంతో తాను దిగ్బ్రాంతి చెందినట్లు హృతిక్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఈ సందర్భంగా హృతిక్ శ్రీదేవితో కలసి నటించి మూమెంట్ ని గుర్తుచేసుకున్నాడు. హృతిక్ రోషన్ బాలనటుడిగా తొలిసారి నటించింది శ్రీదేవితోనే.

దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సూపర్ హీరో
సూపర్ హీరో హృతిక్ రోషన్ శ్రీదేవి మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసాడు. తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది శ్రీదేవి అని హృతిత్ తెలిపాడు.

హృతిక్ రోషన్ బాలనటుడిగా
హృతిక్ సినీ ప్రయాణం మొదలైంది బాలనటుడిగా. అది కూడా శ్రీదేవి చిత్రంలో.. తొలిషాట్ ఆమె పక్కనే. దీనితో నటించడానికి తాను నెర్వస్ గా ఫీల్ అయ్యానని హృతిక్ తెలిపాడు.

వెంటనే నవ్వించేసింది
తాను భయపడుతుండడం శ్రీదేవి గమనించి వెంటనే నవ్వించారని హృతిక్ గుర్తుచేసుకున్నాడు. తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి దైర్యంగా నటించేలా శ్రీదేవి చేసారని హృతిక్ తెలిపాడు.

శ్రీదేవి, హృతిక్ పగలబడి నవ్వుతూ
భగవాన్ దాదా చిత్రంలో శ్రీదేవి పక్కన హృతిక్ బాల నటుడిగా నటించాడు. ఆ సమయంలో శ్రీదేవి పగలబడి నవ్వుతున్న ఫోటోని హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.


Click it and Unblock the Notifications











