గాయం: హృతిక్ రోషన్ విడాకుల కేసుపై ఎఫెక్ట్!
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇటీవల జిమ్‌లో గాయపడ్డాడు. ఈ గాయం కారణంగా ఆయన కొంత కాలం పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన ప్రభావం ఆయన ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌పై కూడా పడింది.
హృతిక, ఆయన భార్య సుజానె మధ్య విడాకుల కేసు నడుస్తోంది. ఈ గాయం కారణంగా ఆయన విడాకుల కేసు మరింత జాప్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. భార్యతో విడాకుల సందర్భంగా కొన్ని సెటిల్మెంట్ల విషయంలో ఆయన స్వయంగా వెళ్లాల్సి ఉంది. గాయం కారణంగా ఆయన ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

భర్త నుండి సుజానె రోషన్ రూ. 400 కోట్లు భరణం కింద డిమాండ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై హృతిక్ రోషన్ కొన్ని రోజుల క్రితం స్పందించారు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. సుజానె నా నుండి భరణంగా ఒక్క రూపాయి కూడా అడగలేదు. ఇలాంటి అసత్య వార్తల ద్వారా మా ఫ్యామిలీ ప్రైవసీకి భంగం కలిగించ వద్దని హృతిక్ తెలిపారు.
సుజానెను ఇలాంటి వార్తలు భాధిస్తాయి. ఆమె ఇండిపెండెంట్ లేడీ. సొంతగా డిజైనింగ్ కంపెనీ నడుపుతోంది. మా మధ్య డబ్బు గురించి గొడవలు అసలు లేనే లేవు అని తెలిపారు. మాపై వస్తున్న వార్తలన్నీ కల్పితమైనవి. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. నేను ప్రేమిస్తున్న వారిని(సుజానె)ను కించ పరిచే విధంగా ఉన్నాయి. నా సహనాన్ని పరీక్షిస్తున్నారు' అంటూ హృతిక్ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











