క్రిష్ కంటే...ఈ బుల్లి క్రిష్ బెటర్ : హృతిక్
ముంబై: అందరూ హృతిక్ రోషన్ నటించిన 'క్రిష్-3' చిత్రం కోసం ఎదురు చూస్తుంటే.....హృతికేమో మరో బుల్లి క్రిష్‌కు ప్రచారం కల్పించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. 'కిడ్ క్రిష్' పేరుతో రూపొందిన యానిమేషన్ మూవీని ఆయన మంగళవారం విడుదల చేసారు. ఈ సందర్భంగా హృతిక్ మాట్లాడుతూ...క్రిష్ కంటే కిడ్ క్రిష్ బెటర్ వెర్షన్ అని వ్యాఖ్యానించారు.
గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న ఈ సినిమా ప్రీమియర్‌ను కార్టూన్ నెట్వర్క్ ఛానల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయనున్నారు. కిడ్ క్రిష్ గురించి హృతిక్ మాట్లాడుతూ....క్రిష్ కంటే కిడ్ క్రిష్ వెర్షన్ ఎంతో బెటర్. కిడ్ క్రిష్ ఎవరి సాయం లేకుండా ఏదైనా చేయగలడు, ఎక్కడికైనా ఎగరగలడు. ఈ యానిమేషన్ మూవీ పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది అని వ్యాఖ్యానించాడు.
ఇక హృతిక్ రోషన్ నటించిన 'క్రిష్-3' సినిమా విషయానికొస్తే...హృతిక్ రోషన్ హీరోగా రాకేష్ రోషన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'క్రిష్ 3'. హృతిక్ రోషన్‌తో పాటు వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
గతంలో బాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ మూవీస్ కోయి మిల్ గయా, క్రిష్ చిత్రాలకు సీక్వెల్‌గా క్రిష్-3 చిత్రం రూపొందుతోంది. హృతి రోషన్ తండ్రి రాకేష్ రోషన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈచిత్రపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications












