మగాళ్లు-మగాళ్లు శృంగారం తప్పులేదంటన్న స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మగాళ్లు-మగాళ్లు మధ్య జరిగే శృంగారం(హోమో సెక్సువాలిటీ) తప్పులేదంటున్నాడు. అది వ్యాధి ఏమాత్రం కాదని, వాళ్లది ఒక భిన్నమైన వ్యక్తిత్వం మాత్రమే అని హోమో సెక్సువల్స్ కు మద్దతు ప్రకటించారు. హోమో సెక్సువాలిటీ అనేది ఇప్పటిది కాదు, వందల ఏళ్లుగా హోమో సెక్సువల్స్ ఉన్నారు. దీని వల్ల సమాజానికి వచ్చిన నష్టమేమీ లేదని...వాదిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడంతో సర్వత్రా చర్చనీయాంశం అయింది.
హృతిక్ రోషన్ త్వరలో క్రిష్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో ఈ హీరో అదిరిపోయే కండల బాడీతో కనిపించబోతున్నాడు. గతంలో హృతిక్ నటించిన క్రిష్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో.... క్రిష్-2 తో దాన్ని మించి పోవాలని ఆశిస్తున్న హృతిక్...ఈ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. రాకేశ్ రోషన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2012లో విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











