twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మందులు వికటించి ఆసుపత్రిలో చేరిన హృతిక్‌ రోషన్

    By Srikanya
    |

    బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌రోషన్‌ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు.ఆయన తాజా చిత్రం గుజారిష్ ప్రమోషన్ లో ఉన్న ఆయనకు ఇది సమస్యగా మారింది. హృతిక్‌ రోషన్ తీసుకున్న యాంటిబయాటిక్‌ మెడిసిన్ వికటించటమే ఈ స్ధితికి కారణం అంటున్నారు. ఆ మందులు పడక ఎలర్జీకి గురవడంతో ఆదివారం మధ్యాహ్నం ఆయన ముంబైలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చేర్చారు. హృతిక్, ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో సంజయ్ లీలా బన్సాలీ రూపొందించి 'గుజారిష్‌' చిత్రం శుక్రవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆదివారం ధియోటర్స్ కి ప్రమోషన్ టూర్ కి వెళ్లే ముందు ఆయన వేసుకొన్న మందులు వికటించాయి అని డాక్టర్స్ తెలిపారు. ఈ విషయమై హృతిక్ వివరణ ఇస్తూ..."యాంటిబయాటిక్‌ వల్ల నేను ఎలర్జీకి గురైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. గొంతు మూసుకుపోయి ఊపిరి తీసుకోలేకపోయాను..ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను. రాత్రికి ఇంటికి వెళ్లిపోవచ్చు" అన్నారంటూ తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. గుజారిష్ చిత్రంలో హృతిక్ రోషన్...ఇంద్రజాలికుడి గా అనంతరం శరీరం చచ్చుబడిపోయిన ఓ యువకుడుగా తనకు మరణభిక్ష పెట్టాలని కోరుకునే వ్యక్తిగా కనిపించారు. ఐశ్వర్య రాయ్‌ తన భర్త నుంచి విడిపోయిన ఓ నర్సు పాత్రలో జీవించింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X