బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కు విడాకులు మంజూరు

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, అతని భార్య సుజన్నే ఖాన్ లకు విడాకులు మంజూరయ్యాయి. గతేడాది డిసెంబర్ లో విడిపోవాలని నిర్ణయించుకున్న వారిద్దరు ముంబయిలోని బాంద్రా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటి ఆధారంగా న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.

అయితే, కోర్టు వాదనలకు వచ్చేందుకు కుదరని హృతిక్ మరో తేదీని ఇవ్వాలని అడిగాడట. కానీ, షెడ్యూల్ ప్రకారం అంటే అక్టోబర్ 31న విచారణ పూర్తవడంతో కోర్టు విడాకులిచ్చేసింది. అటు వారిద్దరి పిల్లలు ఎవరి కస్టడీలో ఉండాలనేది ఇంకా నిర్ణయించలేదట. ఈ విషయాన్ని కూడా త్వరలోనే న్యాయస్థానం తేల్చనుంది. ప్రేమించి వివాహం చేసుకున్న హృతిక్, అతని భార్యకు హ్రిహాన్, హ్రిదాన్ అనే ఇద్దరు కుమారులున్నారు.

Hrithik Roshan-Sussanne Khan divorce finalised

హృతిక్ రోషన్ ఇటీవల జిమ్‌లో గాయపడ్డాడు. ఈ గాయం కారణంగా ఆయన కొంత కాలం పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గాయం కారణంగా ఆయన విడాకుల కేసు మరింత జాప్యం అయ్యే అవకాశం ఉందనుకున్నారు కానీ అలాంటిదేమీ జరుగలేదు.

Hrithik Roshan-Sussanne Khan divorce finalised

భర్త నుండి సుజానె రోషన్ రూ. 400 కోట్లు భరణం కింద డిమాండ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై హృతిక్ రోషన్ కొన్ని రోజుల క్రితం స్పందించారు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. సుజానె నా నుండి భరణంగా ఒక్క రూపాయి కూడా అడగలేదు. ఇలాంటి అసత్య వార్తల ద్వారా మా ఫ్యామిలీ ప్రైవసీకి భంగం కలిగించ వద్దని హృతిక్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X