ముద్దు మ్యాటర్, జర్నలిస్టుకు స్టార్ హీరో ఝలక్!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గత కొన్ని రోజుల క్రితం వచ్చిన 'జిందగీ న మిలేగి దుబారా' చిత్రంలో కత్తిలాంటి హీరోయిన్ కత్రినా కైఫ్ తో కైపెక్కించే ముద్దు సన్నివేశాల్లో నటించిన విషయం తెలిసిందే. తాజా ఈ ఇద్దరు 'అగ్నిపథ్' సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య మరోసారి ముద్దు సీన్లు ఉంటాయనే ప్రచారం సాగుతోంది.
ఇటీవల అగ్నిపథ్ సినిమాకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఓ జర్నలిస్టు ముద్దు సీన్ గురించి హృతిక్ రోషన్ ను గుచ్చిగుచ్చి అడగటంతో....అలాంటి సీన్లు అగ్నిపథ్ లో లేవని తేల్చి చెప్పాడు. అయినా సదరు సర్నలిస్టు వదలక పోవడంతో...అతన్ని స్టేజీ పైకి పిలిచి ముద్దు గురించి క్లాస్ పీకాడు. మీరు నా వద్దకి వస్తే నేను ఆమెను ఎలా ముద్దు పెట్టుకున్నానో కూడా వివరిస్తా అంటూ ఝలక్ ఇచ్చాడు.
ఇక అగ్నిపథ్ సినిమా విషయానికొస్తే...శాటిలైట్ హక్కుల అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. ఈ చిత్రం శాటిలైట్ హక్కులు రూ.41కోట్లకు జీటీవీ దక్కించుకున్నట్టు బాలీవుడ్ టాక్. హృతిక్‌రోషన్, ప్రియాంక చోప్రా, సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషించిన 'అగ్నిపథ్' జనవరి 26న విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications