పాపం బాలీవుడ్​ హీరోలు.. వివాదంలో జొమాటో యాడ్​.. హృతిక్​ రోషన్​కు దెబ్బ !

ప్రస్తుతం హిందీ హీరోలు ఎదుర్కొంటున్న పరిస్థితు చూస్తుంటే పాపం అనిపించేలా ఉంది. బాయ్​కాట్​ బాలీవుడ్​ సోషల్​ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో బాలీవుడ్ హీరోలు ఏం ముట్టుకున్న, పట్టుకున్న పెద్ద రచ్చ అయి కూర్చొంటుంది. హిందీ పరిశ్రమకు చెందిన కథానాయకులకు, దర్శకనిర్మాతలకు సనతాన ధర్మాలు, సాంప్రదాయాలు తెలియవు, దేవుళ్లపై విశ్వాసం లేదు అంటూ ఎప్పుడో ఓసారి విమర్శిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా నెటిజన్లే కాకుండా తమ మనోభావాలను దెబ్బ తీసారాని బాలీవుడ్​ గ్రీక్​ గాడ్ హృతిక్​ రోషన్​పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఓ వర్గం. ఆ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ గ్రీక్​ గాడ్​ హృతిక్​ రోషన్​పై ఉజ్జయిని మహాంకాళేశ్వరం ఆలయానికి చెందిన ఇద్దరు పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హృతిక్​ రోషన్​ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్​ చేస్తున్నారు. అసలు హృతిక్​ రోషన్​ చేసిన తప్పేంటంటో ప్రముఖ ఫుడ్​ డెలీవరి యాప్​ జొమాటో తాజా యాడ్​లో నటించడమే.

Hrithik Roshan Zomato Ad Makes Angry To Ujjain Mahakal Priest

ఇటీవల హృతిక్​ రోషన్​తో ఓ యాడ్​ చేసి బయటకు వదిలింది జొమాటో కంపెనీ. ఈ యాడ్​లో హృతిక్​ చెప్పిన డైలాగ్​లు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఉజ్జయిని మహాంకాళేశ్వరం ఆలయ పూజారులు గగ్గోలు పెడుతున్నారు.

ఈ యాడ్​లో కమాండోగా నటించిన హృతిక్​ రోషన్​ ఆకలి వేసి ఫుడ్​ ఆర్డర్​ చేసుకుంటాడు. అక్కడున్న మిగతా కమాండోలు 'ఈ ఫుడ్​ ఆర్డర్​ ఎవరిచ్చారు?' అని ప్రశ్నించగా.. 'నేనే. నాకు ఆకలిగా అనిపించింది. ఉజ్జయినిలోని మహాకాళ్​ నుంచి తాలీ ఆర్డర్​ చేశా' అని హృతిక్ రోషన్​ మిగతా కమాండోలకు చెబుతున్నట్లుగా ఆ ప్రకటనలో ఉంది.

Hrithik Roshan Zomato Ad Makes Angry To Ujjain Mahakal Priest

ఈ సంభాషణపైనే ఉజ్జయిని మహాకాళేశ్వరం ఆలయానికి చెందిన పూజారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే, ఆ ఆలయం నుంచి తాలీ అనే పేరుతో భక్తులకు, యాత్రికులకు ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. మహాకాళ్​ అనేది శివునికి మరో పేరు.

హిందువులు పూజించే పవిత్రమైన 12 జ్యోతిర్లింగాల్లో మహాకాళేశ్వరం గుడి అత్యంత పవిత్రమైనదిగా చెబుతుంటారు. అలాంటి ఎంతో పవిత్రమైన ఆలయం నుంచి శివుని ప్రసాదంగా ఇచ్చే తాలీని, మహాకాళ్​ రెస్టారెంట్​ అని మహాకాళేశ్వరం ఆలయాన్ని ప్రస్తావించడంపై పూజారులు మండిపడుతున్నారు.

Hrithik Roshan Zomato Ad Makes Angry To Ujjain Mahakal Priest

అయితే ఈ యాడ్​లో మహాకాళ్​ రెస్టారెంట్​ను ఏం చూపించలేదు. దీంతో మహాకాళేశ్వరం ఆలయం గురించే చెప్పారని వారు అసహనం వ్యక్తం చేశారు. అందుకే హృతిక్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేస్తున్నారు. అలాగే వారితోపాటు పలువురు నెటిజన్లు సైతం విమర్శిస్తున్నారు.

బాలీవుడ్​ వాళ్లకు సనాతన ధర్మాలపై గౌరవం లేదంటూ ఒకరు, హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా చిత్రీకరించిన ఆ ప్రకటనపై కఠిన చర్యలు తీసుకోవాలని మరొకరు డిమాండ్​ చేశారు. అయితే ఈ వ్యవహారంపై జొమాటో ట్విటర్​ ద్వారా స్పందించింది.

Hrithik Roshan Zomato Ad Makes Angry To Ujjain Mahakal Priest

'లోకల్​ రెస్టారెంట్​లను ప్రమోట్​ చేసే పాన్​ ఇండియా క్యాంపెయిన్​లో భాగమే ఈ యాడ్​. ఉజ్జయినిలో జొమాటోకు మహాకాళ్​ రెస్టారెంట్​ నుంచి అత్యధిక ఫుడ్ ఆర్డర్లు వస్తుంటాయి.అందులోనూ అక్కడ మెనూలో ఉన్న తాలీ పేరుగల ఫుడ్​కు ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే ఆ ఫుడ్​ను ఎక్కువగా ఆర్డర్​ చేసుకుంటారు. అదే చూపించాం' అని తెలిపింది.

అయితే ఈ వ్యవహారమంతా హృతిక్ రోషన్ రాబోయే చిత్రం విక్రమ్​-వేదాపై పడనున్నట్లు తెలుస్తోంది. బాయ్​కాట్​ బాలీవుడ్​లో భాగంగా విడుదలైన సినిమాలే కాకుండా, రిలీజ్​కు రెడీ అవుతున్న, చిత్రీకరణలో ఉన్న సినిమాలపై కూడా బాయ్​కాట్​ బాలీవుడ్​ ట్రెండ్​ ప్రభావం ఉంది. ఇక ఇప్పుడు ఈ జొమాటో యాడ్​ చేసిన హృతిక్​ రోషన్ పరిస్థితి ఎరక్కపోయి ఇరుక్కున్నట్లుగా దెబ్బ పడేలా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X