For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తారాస్థాయికి హృతిక్ ఇంట్లో విభేదాలు... సోదరి గృహ నిర్భంధం.. సూసైడ్‌కు బెదిరింపులు!

|
Hrithik's Sister Sunaina Says, 'My Father Slapped Me Because I Love A Muslim Guy' | Filmibeat Telugu

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఇంట్లో విభేదాలు, గొడవలు తీవ్రస్థాయికి చేరుకొన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. హృతిక్‌కు ఆయన సోదరి సునైనా రోషన్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొన్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో స్పష్టమవుతున్నది. తాజాగా నేను నరకంలో జీవిస్తున్నాను. నాకు సహాయం చేయండి అంటూ కంగన రనౌత్‌కు మెసేజ్ పంపినట్టు ఓ కథనం వెలుగులోకి రావడం బాలీవుడ్‌లో చర్చకు దారి తీసింది. తాజాగా మరికొన్ని విషయాలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అవేమిటంటే..

హృతిక్ సోదరి ప్రేమకు నో

హృతిక్ సోదరి ప్రేమకు ఇంట్లో నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం ఓ కారణంగా చెప్పుకొంటున్నారు. అలాగే డబ్బుకు సంబంధించిన అంశాలు కూడా గొడవలకు కారణమని తెలుస్తున్నది. ఢిల్లీలోకి చెందిన ముస్లిం యువకుడితో సునైనా ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడానికి కుటుంబం ఒప్పుకోకపోవడం వివాదానికి కేంద్ర బిందువుగా మారినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సునైనాను హృతిక్ కుటుంబం గృహనిర్బంధంలో ఉంచినట్టు తెలుస్తున్నది.

నన్ను నిర్బంధించారని

ఇంట్లో నెలకొన్న గొడవల నేపథ్యంలో సునైనా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ముస్లిం మతానికి చెందిన రిపోర్టర్‌తో ప్రేమలో ఉన్నాను. మా నాన్న మా ప్రేమను అంగీకరించడం లేదు. నా ప్రియుడిని టెర్రరిస్టు అని అంటున్నారు. ప్రేమ విషయంలో నన్ను కొట్టారు. అతడిని కలుసుకోకుండా గృహనిర్భంధం చేశారు అని సునైనా చెప్పారు.

ఒంటరిగా ఉంటానని సునైనా

హృతిక్ కుటుంబానికి సునైనా దూరంగా ఉండాలని అనుకొంటున్నారట. అందుకోసం ప్రత్యేకంగా ఓ ఫ్లాట్ చూడమని కుటుంబానికి చెప్పిందట. అంతేకాకుండా నెలసరి ఖర్చుల కోసం రూ.2.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారట. అయితే అందుకు హృతిక్ ఒప్పుకోలేదని.. అంత డబ్బు దుబారా చేయడం ఎందుకని ప్రశ్నించడంతో వారిద్దరి మధ్య గొడవలు ఊపందుకొన్నాయని బాలీవుడ్ పత్రిక కథనాన్ని వెల్లడించింది.

హృతిక్ రోషన్ మాజీ భార్య రియాక్షన్

సునైనా వివాదంపై హృతిక్ మాజీ భార్య సుసాన్ ఖాన్ స్పందించారు. సునైనా మంచి అమ్మాయి. కుటుంబమంటే గౌరవం ఉంది. కానీ ఆమె పరిస్థితి బాగాలేదు. ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడాలని కోరుకొంటున్నాం అని అన్నారు. హృతిక్‌పై చవకబారు కామెంట్లు చేయడం ఆపకపోతే కుటుంబ పరువు గంగలో కలిసిపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని సూచిస్తున్నారు.

కంగన రనౌత్ సోదరి షాకింగ్ కామెంట్స్

హృతిక్ కుటుంబంలో చోటుచేసుకొన్న వివాదంపై కంగనరనౌత్ సోదరి రంగోలి చందేల్ స్పందిస్తూ.. సునైనాకు ప్రాణాప్రాయం ఉంది. ఆమె ఆత్మహత్య చేసుకొంటానని బెదిరిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఆమెకు ముప్పు ఉంది. కంగన సహాయం కోరుతున్నది అంటూ రంగోలి ట్వీట్ చేశారు. హృతిక్‌తో తన సోదరి కంగనకు గొడవలు ఉన్నందున సునైనాకు దూరంగా ఉంటున్నామని పేర్కొన్నారు.

English summary
Hrithik Roshan Sister Sunaina Roshan has lashed out at her family for not agreeing to take care of her expenses and accepting the man she loves into the family. In this occassion, Sussanne Khan too, took to social media to support Hrithik and the family. Calling Sunaina 'an extremely loving warm, caring person' who is undergoing an 'unfortunate situation'.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more