‘హృదయ కాలేయం’ ఆడియో వేడుక, పవర్ స్టారే కారణమన్న సంపూర్ణేష్ బాబు
హైదరాబాద్: వెరైటీ సినిమా ప్రమోషన్లతో, వెరైటీ సినిమా టైటిల్, ట్రైలర్లతో గత కొంత కాలంగా ప్రేక్షకుల్లో ఆసక్తిరేపుతున్న చిత్రం 'హృదయ కాలేయం'. ఎ కిడ్నీ విత్ హార్ట్ అనేది సబ్ టైటిల్. సంపూర్ణేష్ బాబు హీరోయిగా పరిచయం అవుతున్న ఈచిత్రం ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. కావ్యకుమార్, ఇషిక సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రానికి స్టీవెన్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
అమృత ప్రొడక్షన్స్ బేనర్లో సాయి రాజేష్ నిర్మాతగా తెరకెక్కిన ఈచిత్రానికి ఆర్.కె. సంగీతం అందించారు. ఆడియో విడుదల కార్యక్రమానికి యంగ్ డైరెక్టర్ మారుతి, హీరో సందీప్ కిషన్, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు. ట్రైలర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేయగా, ఆడియో సీడీలను మారుతి విడుదల చేసి తొలి ప్రతిని సందీప్ కిషన్‌కు అందజేసారు.
అందుకు సంబంధించిన ఫోటోలు, పవర్ స్టార్ మాదిరి ఫోజులు కొడుతూ సంపూర్ణేష్ బాబు ఇచ్చిన డాన్స్ పెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

పవన్ కళ్యాణ్ మాటలే ఆదర్శం
స్టీవెన్ శంకర్ వల్లనే నేను ఈచిత్రం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఆయన క్రియేటివిటీతో ట్రైలర్స్‌కు మంచి స్పందన వస్తోంది. మనల్ని మనం ఎలా కొత్తగా చూపించుకోవానేది ఆలోచించుకోవాలి. నీ జీవితానికి నువ్వే హీరో అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటలు విని ఇన్ స్పైర్ అయ్యాను. దీనంతటికీ కారణం స్టీవెన్ శంకర్ అని సంపూర్ణేష్ చెప్పుకొచ్చారు.

రాజమౌళి వల్లే...
లక్షలు ఖర్చుపెట్టినా రాని పబ్లిసిటీ రాజమౌళి ట్వీట్ వల్ల వచ్చిది. అలాగే మాకు వెన్నుదన్నుగా నిలిచిన మారుతికి ధన్యవాదాలు అని సంపూర్ణేష్ బాబు తెలిపారు.

మొదట హీరో దొరకలేదు, పార్టీలో సంపూ పరిచయం...
ఇండస్ట్రీకి చాలా మంది దర్శకులు వస్తున్నారు. వారిలో నేనెలా ప్రత్యేకంగా ఉండాలో ఆలోచించాను. రెగ్యులర్ కమర్షియల్ సినిమా వేలోనే సీరియస్ కామెడీ ఉండేట్లు కథ రాసుకున్నాను. మొదట హీరో దొకరలేదు. ఒక పార్టీలో సంపూర్ణేష్ పరిచయం అయ్యాడు. మారుతిగారి సపోర్టుతో 29 రోజుల్లో సినిమా పూర్తి చేసాం. ఈ సినిమా ఇక్కడి వరకు రావడం వెనక చాలా మంది సపోర్టు ఉంది అన్నారు..దర్శకుడు స్టీవెన్ శంకర్.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ...
సంపూర్ణేష్‌తో సినిమా చేయడం అంటే మాములు దర్శకుల వల్ల కాదు. అందుకే స్పీవెన్ స్పీల్ బర్గ్, శంకర్‌ల కలయికైన స్టీవెన్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం మంచి కామెడీ ఎంటర్టెనర్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

మారుతి మాట్లాడుతూ...
సినిమాలు ఇలా కూడా తీయొచ్చా అని ఈ సినిమా ట్రైలర్లు చూసిన తర్వాతే తెలిసింది. టీం మొత్తం చాలా కష్టడ్డారు. సంపూర్ణేష్ మంచి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి. ఈ చిత్ర యూనిట్‌కు సక్సెస్ అందాలని కోరుకుంటున్నాను అన్నారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ...
ఈ సినిమా చూసి నవ్వకుండా ఉండలేక పోయాను. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది. సంపూర్ణేష్ బాబుకు, స్టీవెన్ శంకర్‌కు మంచి పేరొస్తుంది అన్నారు.

మధుర ఆడియో ద్వారా..
మధుర శ్రీధర్‌కు చెందిన మధుర ఆడియో ద్వారా ఈచిత్రం పాటలను విడుదల చేయడంపై సంగీత దర్శకుడు ఆర్.కె ఆనందం వ్యక్తం చేసారు. సినిమాలో నేను అందించిన మ్యూజిక్ కీ పాయింట్‌గా ఉండటం నాకు మరింత సంతోష కలిగించే విషయం అన్నారు.


Click it and Unblock the Notifications











