For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను డిప్రెషన్‌కు గురయ్యా.. చావే పరిష్కారం కాదు.. హృదయకాలేయం డైరెక్టర్ పోస్టు చదివితే..

  |

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత డిప్రెషన్‌పై భారీగా చర్చ మొదలైంది. మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఏదైనా సమస్య ఉంటే స్నేహితులను, సన్నిహితులను, సినీ పెద్దల నుంచి సహకారం తీసుకోవాలనే సూచనలు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువ దర్శకుడు, హృదయకాలేయం, కొబ్బరి మట్ట ఫేం సాయి రాజేశ్ సోషల్ మీడియాలో స్పందించారు. డిప్రెషన్ అనేది ప్రతీ ఒక్కరి మీద ఒకేలా ప్రభావం చూపదు. అది వ్యక్తిగతమైనదంటూ ఎమోషనల్‌గా స్పందించారు. సాయి రాజేష్ తన డిప్రెషన్ గురించి వెల్లడిస్తూ..

  దు:ఖం పొంగుకొస్తుంది.. కానీ బయటకు రాదు..

  దు:ఖం పొంగుకొస్తుంది.. కానీ బయటకు రాదు..

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత డిప్రెషన్‌పై భారీగా చర్చ మొదలైంది. మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఏదైనా సమస్య ఉంటే స్నేహితులను, సన్నిహితులను, సినీ పెద్దల నుంచి సహకారం తీసుకోవాలనే సూచనలు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువ దర్శకుడు, హృదయకాలేయం, కొబ్బరి మట్ట ఫేం సాయి రాజేశ్ సోషల్ మీడియాలో స్పందించారు. డిప్రెషన్ అనేది ప్రతీ ఒక్కరి మీద ఒకేలా ప్రభావం చూపదు. అది వ్యక్తిగతమైనదంటూ ఎమోషనల్‌గా స్పందించారు. సాయి రాజేష్ తన డిప్రెషన్ గురించి వెల్లడిస్తూ..

  జీవితంలో ఏదైనా సమస్య వల్ల

  జీవితంలో ఏదైనా సమస్య వల్ల

  జీవితంలో ఏదైనా ఓ సమస్య వల్ల ఇబ్బంది పడటం గానీ, ఏదైనా కోల్పోవాల్సి రావడం గానీ, కోల్పోతాను అనే భయం వల్ల గానీ సాధారణంగా ఓ రకమైన మానసిక రుగ్మతకు గురవుతారు. వ్యక్తుల మధ్య ప్రేమ, ఆరోగ్యం, పరువు, ప్రతిష్టలకు భంగం కలుగుతుందనే భాధ, డబ్బు, మనశ్శాంతి కోల్పోతామనే బెంగతో డిప్రెషన్‌లో వెళ్లుంటారు. నేను నా జీవితంలో చాలాసార్లు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ముఖ్యంగా 1999 నుంచి 2000 వరకు 2014 నుంచి 2016 మధ్య తీవ్ర స్థాయిలో డిప్రెషన్‌‌కు గురయ్యాను. ఒకసారి డిప్రెషన్ కోసం ట్రీట్‌మెంట్ కూడా తీసుకున్నాను అని సాయి రాజేశ్ అన్నారు.

   డిప్రెషన్‌కు గురైతే

  డిప్రెషన్‌కు గురైతే

  డిప్రెషన్‌కు గురైతే మనసు అంత: పొరల్లోంచి దు:ఖం పొంగుకొస్తుంటుంది. కానీ ఏడుపు రాదు. కడుపులోంచి బాధ గొంతు వరకు వచ్చి అక్కడే తిరుగుతూ మనిషిని స్థిమితంగా ఉంచదు. సన్నిహితులు, స్నేహితులకు చెప్పుకోలేని విధంగా పరిస్థితి ఏర్పడుతుంది. బాధలో ముద్ద గొంతులోకి దిగనివ్వు. ఎదుటి వ్యక్తి నవ్వుతున్నా మనం నవ్వలేని పరిస్థితి. ఏ పని చేయలేని స్థితి. ఇలాంటి ఇబ్బంది నుంచి ఎప్పుడు బయటపడుతామనే గ్యారెంటి కనిపించదు. మొహంలో బాధ తెలియకుండా లోలోపలే ఏడుస్తూ మానసికంగా క్షోభను అనుభవించడం కష్టంగా మారుతుంది అని సాయి రాజేష్ పేర్కొన్నారు.

  బాధల్లో ఉన్నప్పుడు స్నేహితులు, సన్నిహితులతో

  బాధల్లో ఉన్నప్పుడు స్నేహితులు, సన్నిహితులతో

  ఏదైనా సమస్య వస్తే.. పరువు, ప్రతిష్టలు అనే విషయాలను పట్టించుకోవద్దు. నీ మనసుకు నచ్చిన వాళ్లకు లేదా నిన్ను అర్ధం చేసుకొంటున్నవారితో బాధను పంచుకొండి. వారి నుంచి వచ్చే పరిష్కారం, సూచనలు మీకు ఉపశమనం కలిగించడానికి అవకాశం ఉంటుంది. ప్రతీ సమస్య ఎక్కువ కాలం ఉండదు. ప్రతీ సమస్యకు ఓ గడువు తేది ఉంటుంది. బాధల్లో ఉన్నప్పుడు కలిగే ఇబ్బంది తాత్కాలికమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదైనా నష్టం జరిగితే దానిని అధిగమించడానికి అవకాశం ఉంటుందనే సానుకూల దృక్పథంతో ఉండాలి అని సాయి రాజేష్ తన సుదీర్ఘమైన పోస్టులో వెల్లడించారు.

  డాక్టర్ ఎంచుకోవడం సగం విజయం

  డాక్టర్ ఎంచుకోవడం సగం విజయం

  డిప్రెషన్ అనేది చికిత్సకు లొంగేదని తెలుసుకోవాలి. అంతేగానీ మరణమే దానికి పరిష్కారమనే విషయాన్ని దూరంగా పెట్టాలి. మొహమాటం లేకుండా మీ సమస్యను డాక్టరకు చెప్పండి. ఈ విషయంలో నిజాయితీతో కూడిన డాక్టర్‌ను ఎంచుకోవడం ప్రధానమైన నిర్ణయంగా భావించాలి. కౌన్సిలింగ్‌తో కొంత బయటపడొచ్చు. ట్యాబ్లెట్స్‌తో మీ బాధ తగ్గవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే మానసికంగా ఉత్సాహం కలుగడానికి చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి అని సాయి రాజేష్ అన్నారు.

  Sushant Singh Rajput కూడా Uday Kiran లాగా నే ! ఇద్దరిలో ఒక కామన్‌ పోలిక...!!
  డాక్టర్ సలహాలు జాగ్రత్తగా పాటించాలి

  డాక్టర్ సలహాలు జాగ్రత్తగా పాటించాలి


  నీకు విపరీతమైన బాధ అనిపిస్తే ఒక్కడివే కూర్చొని ఏడ్చేయ్. దాంతో కొంత ఉపశమనం కలుగుతుంది. మనసులో పెట్టుకొని కుమిలిపోతే దాని వల్ల సమస్య పెరుగుతుందే గానీ.. తరగదు. ఇలా డాక్టర్ ఇచ్చిన సలహాలు పాటించడం వల్ల నాకు ఉపశమనం లభించింది. సమస్యలు వెంటాడినప్పుడు నీ జీవితంలో చోటుచేసుకొన్న మంచి రోజులు గురించి తలుచుకొని ఆలోచిస్తే మరింత ఉత్సాహం కలుగుతుంది అని సాయి రాజేష్ తన జీవిత అనుభావాన్ని వెల్లడించారు.

  English summary
  Hrudaya Kaleyam director Sai Rajesh revealed about his depression. Sai Rajesh said he was in heavily depressed in 1999 to 2000 and 2014 to 2016.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X