మోహన్ బాబుని ఢీ కొడుతున్న సంపూర్ణేష్ బాబు

By Srikanya

హైదరాబాద్: మోహన్ బాబుతో ఢీ కొనడానికి ఫేస్ బుక్ హీరో సంపూర్ణేశ్‌బాబు సిద్దమవుతున్నారు. అతని తాజా చిత్రం 'హృదయ కాలేయం' ని...మోహన్ బాబు చిత్రం రౌడీ రిలీజ్ రోజే విడుదల చేస్తున్నారు. ఈ మేరకు చిత్రం సెన్సార్ సహా నిర్మాణ కార్యక్రమాల్ని పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రియల్ 4 న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు పబ్లిసిటీ ని ప్రారంభించారు. అమృత క్రియేషన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో స్టీవెన్ శంకర్ నిర్మించిన ఈ చిత్రంలో కావ్య కుమార్, ఇషికాసింగ్ హీరోయిన్స్.

రీసెంట్ గా ఆడియో రిలీజైన ఈ చిత్రం యూ ట్యూబ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. సినిమా టీజర్ యూట్యూబ్‌లో పదిలక్షల వ్యూస్‌కు చేరువై సంచలనం రేపుతోంది. నిర్మాత, దర్శకుడు రాజ్ కందుకూరి ఈ చిత్రంతో డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. నైజాం, గుంటూరు ఏరియాల్లో ఆయన ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. బిజినెస్ సైతం ఓ రేంజిలో జరిగిందని వినికిడి.

 Hrudaya Kaleyam to release on April 4th

ఇక రౌడీ విషయానికి వస్తే...మంచు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రౌడీ'. విష్ణు, శాన్వి జంటగా నటించారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించారు. పార్థసారధి, గజేంద్ర, విజయ్‌కుమార్‌ నిర్మాతలు. ఏప్రిల్‌ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మంచు విష్ణు మాట్లాడుతూ... ఒకటీ, ఒకటీ కలిస్తే ఒకటే! ఇదీ రాయలసీమ లెక్క. ఇక్కడ ఇద్దరు శత్రువులు కలిస్తే ఒక్కరే మిగులుతారు. ఇద్దరు మిత్రులు కలిస్తే.. ఒక్కటైపోతారు. రాయలసీమలో ఉండే 'అన్న' సిద్ధాంతం ఇదే. ఇంతకీ ఆయనేం చేశాడో..? అన్నగా ఏం సాధించాడో తెలియాలంటే మా సినిమా చూడండి అంటున్నారు. నాన్నగారి పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. వర్మ పనితనం ఎలా ఉంటుందో, ఆయన సాంకేతిక నైపుణ్యం ఏమిటో ఈ సినిమాతో మరోసారి తెలుస్తుంది.

విశ్రాంతి సన్నివేశం ముందు ఓ పోరాట సన్నివేశం ఉంది. అది దాదాపు 11 నిమిషాల పాటు సాగుతుంది. ఆ సన్నివేశం నేనే మళ్లీ తెరపై చూస్తే.. ఒళ్లు గగుర్పొడిచింది. అంత శక్తిమంతంగా రూపొందించారు. జయసుధగారి పాత్ర.. మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అందుకే విడుదలకు ముందు ప్రత్యేకంగా ఈ సినిమా కొంతమంది మహిళా ప్రేక్షకులకు చూపించాలని నిర్ణయించాం. విశాఖపట్నం, బెంగళూరులో 'రౌడీ' చిత్రంలోని కొన్ని సన్నివేశాల్ని కొంతమంది ప్రేక్షకులకు చూపిస్తాము''అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X