మహేషా మజాకా.. సూపర్ స్టార్ సినిమా ధర బాంబులా పేలింది, అక్కడే ఇలా ఉంటే!

Recommended Video

Huge Amount For Super Star Mahesh Maharshi Hindi Satellite Rights

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. అనేక ప్రత్యేకతలు ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ పై మహేష్ అభిమానుల్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కాదు. రెండేళ్ల గ్యాప్ తరువాత వంశీ పైడి పల్లి మహేష్ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేశాడు. మహేష్ సినిమాకు ఏస్థాయిలో మార్కెట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజగా ఈ చిత్ర బిజినెస్ గురించి వస్తున్న వార్తలు ట్రేడ్ వర్గాలకు కూడా షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి.

రైతు సమస్యల నేపథ్యంలో

రైతు సమస్యల నేపథ్యంలో

మహర్షి చిత్రంలో దర్శకుడు వంశీపైడిపల్లి రైతు సమస్యలని ప్రభావవంతంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. హాస్య చిత్రాల హీరో అల్లరి నరేష్ ఈ చిత్రంలో మహేష్ స్నేహితుడిగా కనిపించబోతున్నాడు. మహేష్, అల్లరి నరేష్ మధ్యవచ్చే సన్నివేశాలపై అద్భుతంగా ఉండబోతున్నాయని సమాచారం.

వచ్చే వేసవికి

వచ్చే వేసవికి

2019 వేసవికి మహర్షి చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.

అప్పుడే ప్రీరిలీజ్ బిజినెస్

అప్పుడే ప్రీరిలీజ్ బిజినెస్


సూపర్ స్టార్ మహేష్ సినిమా హక్కులు దక్కించుకోవడానికి బయ్యర్లు కాచుకుని మరీ కూర్చుంటారు. ఇప్పుడు మహర్షి సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ చిత్ర హిందీ శాటిలైట్ హక్కుల ధర బాంబులా పేలినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. తెలుగు చిత్రాల హిందీ శాటిలైట్ హక్కులు ప్రస్తుతం మంచి డిమాండు ఉంది.

కళ్ళు చెదిరేలా

కళ్ళు చెదిరేలా

నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర హిందీ శాటిలైట్ హక్కుల కోసం 25 కోట్ల భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతమొత్తం చెల్లించేందుకు కూడా ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. యూట్యూబ్ లో హిందీలో డబ్ అయిన తెలుగు చిత్రాలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్న సంగతి తెలిసిందే.

రాంచరణ్ సినిమాని అధికమించేలా

రాంచరణ్ సినిమాని అధికమించేలా

రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శత్వంలో నటిస్తున్నాడు. మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. మాస్ చిత్రాలకు హిందీలో కూడా మంచి ఆదరణ ఉంటుంది. సరైనోడు హిందీ వర్షన్ యూట్యూబ్ లో సృష్టించిన సునామి అందరికి తెలిసిందే. దీనితో రాంచరణ్, బోయపాటి చిత్ర హిందీ శాటిలైట్ హక్కులకు 22 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మహర్షి 25 కోట్లకు అమ్ముడైతే టాప్ పొజిషన్ లో నిలిచిన చిత్రం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X