వైఎస్ఆర్‌పై అభిమానంతో .. యాత్ర ఫస్ట్ టికెట్‌ని 4.37 లక్షలకు కొన్న ఎన్నారై!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో కీలక ఘట్టం పాదయాత్ర నేపథ్యంలో యాత్ర చిత్రం తెరకెక్కింది. మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు. టాలీవుడ్ లో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న సమయంలో యాత్ర చిత్రం ఆసక్తి రేపుతోంది. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలోని మొదటి భాగం ఎన్టీఆర్ కథాయానాకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న యాత్ర చిత్రం రాబోతోంది.

 పాదయాత్ర కీలకంగా

పాదయాత్ర కీలకంగా

దర్శకుడు మహి వి రాఘవ్ ఈ చిత్రంలో వైఎస్ఆర్ 2003 లో చేసిన పాదయాత్రనే కీలకంగా చూపించబోతున్నారు. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత మమ్ముట్టి తెలుగులో నటిస్తున్నా ఈ చిత్రానికి సొంతంగా డబ్బింగ్ చెప్పకున్నారు. ఎమోషనల్ సన్నివేశంలో మమ్ముట్టి నటన హృదయాన్ని హత్తుకునేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాల గురించి కూడా ఈ చిత్రంలో చూపించినట్లు తెలుస్తోంది.

అభిమానంతో

అభిమానంతో

తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ ని అభిమానించేవాళ్ళు చాలామందే ఉన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బాగా ప్రజల్లోకి వెళ్లాయి. తాజాగా ఓ ఎన్నారై అభిమాని యూఎస్ లో యాత్ర సినిమా మొదటి టికెట్ ని వేలం పాటలో 4.37 లక్షలకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మునీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ పై ఉన్న అభిమానంతో ఇంతమొత్తం వెచ్చించి తొలి టికెట్ దక్కించుకున్నాడు. యూఎస్ లో టికెట్ సాధారణ ధర 12 డాలర్లు. మునీశ్వర్ రెడ్డి వేలం పాటలో 6,116 డాలర్లకు తొలి టికెట్ ని అందుకున్నారు.

వైఎస్ఆర్ ఫౌండేషన్

వైఎస్ఆర్ ఫౌండేషన్

నిర్మాతలు తొలి టికెట్ డబ్బుని వైఎస్ఆర్ చారిటి ఫౌండేషన్‌కు తరలించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం మొదలు కావడంతో ఇటు యాత్ర చిత్రం, అటు ఎన్టీఆర్ మహాయానాకుడు చిత్రాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఈ రెండు చిత్రాలు విడులయ్యాక రాజకీయ చర్చ మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.

జగన్ ప్రమేయం

జగన్ ప్రమేయం

యాత్ర చిత్రం విషయంలో జగన్ ప్రమేయం ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఆ వార్తలని దర్శకుడు మహి వి రాఘవ్ ఇటీవల ఖండించారు. జగన్ ఈ చిత్రాన్ని ఫండ్స్ ఇచ్చారనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. మా తండ్రి చేసినవి చూపించండి.. చేయనవి వద్దు అని ఈ ఒక్క మాటనే జగన్ తనతో చెప్పినట్లు రాఘవ్ యాత్ర ఆడియో వేడుకలో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X