పిచ్చెక్కిస్తున్న KGF క్రేజ్.. ప్లేస్ లేదన్నా నించుని సినిమా చూడ్డానికి రెడీ..!
ఎంతో కాలంగా భారత దేశ సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ KGF: చాప్టర్ 2 సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. యష్ హీరోగా నటించిన ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటి నుంచి సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఇక ఆ సంగతి ఏంటో చూద్దామా?

KGF-2
హీరో యశ్ -ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన`KGF - ఛాప్టర్ 1`తో అందరినీ ఆకర్షించారు. ఆ సినిమాలో యశ్ బాడీ లాంగ్వేజ్, స్టైల్ తెలుగువారినీ ఆకట్టుకున్నాయి. దాంతో `KGF -1` తెలుగునాట సైతం మంచి విజయం సాధించింది. ఆ చిత్రం సీక్వెల్ గా రూపొందిన `KGF-2` పైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.

ఘన స్వాగతం
సంజయ్ దత్ విలన్ అధీరగా సౌత్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీ రావు సహా అనేక మంది నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు.చాప్టర్ 2లో ప్రధాన మంత్రి రమికా సేన్ పాత్రకు రవీనా టాండన్ ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటుంది. అలాగే KGF 2 లో అధీరగా సంజయ్ దత్ నటనను ప్రేక్షకులు మరచిపోలేకపోతున్నారు. ఈ సినిమాతో సంజూ బాబాకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఘన స్వాగతం పలుకుతున్నారు.

ఆగలేమని
యష్ కు దీటుగా క్లైమాక్స్ సీన్స్ లో పోటాపోటీగా నటించారని అంటున్నారు. ఈ సినిమాకు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. బీహార్‌లోని ఒక ప్రాపర్టీలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రదర్శన ఏర్పాటు చేశారు. కానీ అప్పటిదాకా ఆగలేమని అక్కడి ఆడియన్స్ డిమాండ్ చేయడంతో ఉదయం 11.30 గంటలకు సినిమా ప్రారంభమయింది.

నెక్స్ట్ లెవెల్ క్రేజ్
అక్కడి ఎగ్జిబిటర్ మాట్లాడుతూ, ప్రజలు నిలబడి సినిమా చూడటానికి సిద్ధంగా ఉన్నారని, హాల్ లోపల 1000 మంది ఉన్నారని అయినా ఇంకా 500 మంది బయట నిలబడి లోపలోకి ఎలా అయినా వెళితే వెనుక నిలబడి చూడడానికి కూడా సిద్దంగా ఉన్నారని అంటున్నారు. ఇది ఒకరకంగా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అని అంటున్నారు.
Recommended Video


సంచలనాలను సృష్టిస్తోంది
KGF: చాప్టర్ 2 ప్రేక్షకులలో రాకీ భాయ్ విద్వంశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణాలోని థియేటర్లలో పలువురు అభిమానులు పటాకులు కలుస్తూ ఈలలు వేస్తూ ఆనందోత్సాహాలతో సినిమా చూస్తున్నారు. ఇక అధికారిక లెక్కల ప్రకారం ఈ సినిమా 10,000కు పైగా స్క్రీన్లలో విడుదల అయింది. ఈ సినిమాకు ప్రముఖ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ అయిన బుక్ మై షో, పేటీఎంలలో 40 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు ముందు ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో KGF2 రిలీజ్ కు ముందు అదే స్థాయిలో సంచలనాలను సృష్టిస్తోంది.


Click it and Unblock the Notifications











