మెగా అభిమానం: చలిని లెక్కచేయకుండా ఫ్యాన్స్ (ఫోటో)
హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయమయ్యే వారంతా అదృష్ట వంతులే. ఎందుకంటే వారికి మద్దతు ఇవ్వడానికి లక్షలాది, కోట్లాది మంది అభిమానులు సిద్ధంగా ఉంటారు. కొత్త హీరో, కొత్త సినిమా అయినా తొలి రోజే భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెడతారు. ఇతర ఏ కొత్త హీరోలకు లేనంతగా వారికి గుర్తింపు, ఫాలోయింగ్ ఉంటుంది.
ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్
ఈ రోజు మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘ముకుంద' చిత్రం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు చలి పులి వణికిస్తున్నా....లెక్కచేయకుండా పలువురు మెగా అభిమానులు తెల్లవారు ఝామునే టిక్కెట్ల కోసం థియేటర్ల వద్ద బారులు తీరారు.

పరిశ్రమలో వరుణ్ తేజ్ ‘మెగా ప్రిన్స్'గా చలామని కాబోతున్నాడు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి U/A వచ్చింది. మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ సినిమా కావడం, నిర్మాతలు ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి కావడంతో విడుదల భారీ ఎత్తున చేసారు. సాధారణంగా కొత్త హీరోలకు థియేటర్లు తక్కువగా ఇస్తారు. కానీ వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ వాడు కావడంతో సినిమాకు ఉన్న డిమాండ్ దృష్ట్యా భారీగా థియేటర్లు కేటాయించారు.
ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఆడియోకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాపై పాజిటివ్ ఓపీనియన్ ఏర్పడింది. ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పకుడు.ః


Click it and Unblock the Notifications











