Don't Miss!
- News TTD: శ్రీవారి దర్శనం , సేవలు, వసతి గదుల కోటా విడుదల...!!
- Sports వరల్డ్ కప్‌కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
వకీల్ సాబ్ క్రేజ్: స్పెషల్ షోలతోనే రికార్డ్ క్రియేట్ చేసేలా ఉన్నారు.. ఒక్క టిక్కెట్ రేటెంతంటే?
చాలా కాలం తరువాత టాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న బిగ్గెస్ట్ సినిమా వకీల్ సాబ్. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల కోసం అప్పుడే సెర్చింగ్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా స్పెషల్ బెన్ఫిట్ షోలు ఎక్కడ పడతాయి అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే బెన్ఫిట్ షోలకు సంబంధించిన టిక్కెట్ రేట్లపై కొన్ని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.
అభిమానులకు నచ్చే విధంగా
దిల్ రాజు ప్రొడక్షన్ లో పవన్ కళ్యాణ్ మొదటి సారి చేసిన ఈ సినిమా బాలీవుడ్ పింక్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఒరిజినల్ కథ లాగా కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి అభిమానులకు నచ్చే విధంగా సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు వేణు శ్రీరామ్ క్లారిటీ ఇచ్చేశాడు.
100కోట్ల బిజినెస్..
ఇప్పటికే సినిమాకు సంబంధించిన సాంగ్స్ ఒక్కసారిగా భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇక టీజర్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యింది. ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న వకీల్ సాబ్ సినిమా ఓపెనింగ్స్ తోనే భారీగా రికార్డులను క్రియేట్ చేసేలా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 100కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ చేయవచ్చని సమాచారం.
స్పెషల్ షోలకు రూ.1500
ఇక సినిమాకు సంబంధించిన స్పెషల్ బెన్ఫిట్ షోలు మిడ్ నైట్ నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ లో అయితే దిల్ రాజు గట్టిగానే ప్లాన్ చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. మిడ్ నైట్ రెండు థియేటర్స్ లలో షోలను వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక్కో టిక్కెట్టు ధర 1500వరకు ఉన్నట్లు సమాచారం. గతంలో చాలా మంది స్టార్ హీరోల బెన్ఫిట్ షోలకు ఇదే రేంజ్ లో ధరలను కేటాయించారు.
దిల్ రాజు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు..
ఇక 14 థియేటర్స్ లలో ఉదయం 4గంటలకు అలాగే 7గంటలకు స్పెషల్ షోలను వేయనున్నారట. ఆ షోలకు టిక్కెట్ ధర 500కేటాయిముచినట్లు సమాచారం. ఇది ఎంతవరకు నిజం అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయంపై దిల్ రాజు అధికారికంగా స్పందిస్తేనే అసలు విషయమేమిటో తెలుస్తుంది. ఇక తెలంగాణాలో కూడా స్పెషల్ షోలు పడే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తున్నప్పటికీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు.