విడుదలకు ముందే కోట్లు కురిపిస్తున్న పవన్ కళ్యాణ్.. ఆ సినిమాలకు హై డిమాండ్
అత్యదిక మార్కెట్ ఉన్న టాలీవుడ్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ సినిమా మార్కెట్ పై అంతగా ఫోకస్ పెట్టడని అందరికి తెలిసిన విషయమే. యాడ్స్ కూడా చేయడు. మార్కెట్ వాల్యూ పెరిగేలా అగ్ర దర్శకులతో సినిమా చేయాలని ప్రయత్నం కూడా చేయడు. దర్శక నిర్మాతలే ఆయనతో సినిమా చేయడానికి ఇష్టపడతారు. పవన్ నార్మల్ గా చేస్తేనే ఇలా ఉందంటే ఇంకాస్త ఫోకస్ పెట్టినా మార్కెట్ మాత్రం ఉహీంచని రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ సినిమాల మార్కెట్ కూడా అదే రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా
పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఊహించని రేంజ్ లో ఉంటాయి. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ సినిమా కూడా టాప్ ఓపెనింగ్స్ లో ఒకటీగా నిలిచింది. ఆ సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఇండస్ట్రీలో రికార్డులు బద్దలయ్యే ఛాన్స్ ఉండేది. పవన్ కళ్యాణ్ మార్కెట్ హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా పెరుగుతూనే ఉంటుందని చాలా సార్లు ఋజువయ్యింది.

వకీల్ సాబ్ కు అప్పుడే రూ.31కోట్లా..
అసలు మ్యాటర్ లోకి వస్తే పవన్ చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమాలపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముందుగా వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా నాన్ థియేట్రికల్ (శాటిలైట్ - దిజిటల్ స్టీమింగ్) ద్వారా రూ.31కోట్ల వరకు ప్రాఫిట్స్ అందించినట్లు సమాచారం.

హిస్టారికల్ సినిమాకు భారీ డీల్
ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో రానున్న హిస్టారికల్ సినిమాకు సంబంధించిన ఒక గాసిప్ వైరల్ గా మారింది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు టాక్ వస్తోంది. RRR - ఆచార్య సినిమాల ఓవర్సీస్ హక్కులను తీసుకున్న దుబాయ్ ఫారిన్ కంపెనీ పవన్ - క్రిష్ సినిమా రైట్స్ ను 15కోట్ల ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

రీమేక్ సినిమాకు కూడా హై డిమాండ్
ఇక పవన్ - రానా కాంబినేషన్ లో రానున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ రిమెక్ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా మొదలైనట్లు సమాచారం. ఓవర్సీస్ రైట్స్ వాల్యూ 9కోట్లకు పైగానే ఉంటుందని టాక్ వస్తోంది. ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











