twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ ఏం జరిగిందీ?? స్పైడర్ బయ్యర్లు మునుగుతున్నారా???

    |

    Recommended Video

    Mahesh Babu’s Spyder Film Buyers Are In Shock? బయ్యర్లు మునుగుతున్నారు?

    మొదటి ఆటనుంచే డివైడ్ టాక్ వచ్చినా పండగరోజు కదా ఒకటీరెండు రోజుల్లో మళ్ళీ పుంజుకుంటుందిలే అనుకున్నారు. కానీ స్పైడర్ తప్పటడుగులు వేసింది. రెండో రోజే వసూళ్లు పడిపోగా.. మూడో రోజుకు మరింత డ్రాప్ కనిపించింది. ఊహించని విధంగా మూడో రోజు 'స్పైడర్' తెలుగు వెర్షన్ షేర్ రూ.3 కోట్లు కూడా దాటలేదు. తెలుగు రాష్ట్రాల వరకైతే శుక్రవారం 'స్పైడర్' 2.23 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.

    రెండో రోజు 4.52 కోట్ల షేర్

    రెండో రోజు 4.52 కోట్ల షేర్

    రెండో రోజు ఈ చిత్రానికి ఏపీ, తెలంగాణల్లో కలిపి రూ.4.52 కోట్ల షేర్ వచ్చింది. తొలి రోజు ఈ చిత్రం రూ.16.11 కోట్ల షేర్ వసూలు చేసింది. దీన్ని బట్టి ఈ సినిమా ఎలా పడిపోతూ వస్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏరియాలోనూ ‘స్పైడర్' వసూళ్లు చాలా నామమాత్రంగా వచ్చాయి మూడో రోజు. మరి శని, ఆది వారాల్లో అయినా వసూళ్లేమైనా మెరుగవుతాయేమో చూడాలి.

    తొలి రోజే మిలియన్ డాలర్లు

    తొలి రోజే మిలియన్ డాలర్లు

    అమెరికా ప్రిమియర్లతో కలిపి తొలి రోజే మిలియన్ డాలర్లు వసూలు చేసిన ‘స్పైడర్' అక్కడ కూడా తర్వాతి రోజుకు దబేల్‌మని పడింది. వీకెండ్లో కొత్త సినిమాలు అత్యధిక వసూళ్లు అందుకునే శనివారం రోజు ఈ చిత్రం అక్కడ లక్ష డాలర్ల లోపే వసూలు చేసింది. మహేష్ స్టామినా ప్రకారం చూస్తే ఇవి చాలా తక్కువ వసూళ్లే.

    మహేష్ సినిమా అన్న మార్క్ తో అయినా

    మహేష్ సినిమా అన్న మార్క్ తో అయినా

    మామూలుగా అయితే మహేష్ సినిమా అన్న మార్క్ తో అయినా కొంతలో కొంత ఊరట కలిగే వసూళ్ళు ఉండేవి. కానీ ఊహించిన దానికన్నా పేద్ద ఫ్లాప్ మహేష్ ని వెంటాడింది. స్పైడర్ ఈ సంవత్సరానికి గానూ పాపం బయ్యర్లకు పెద్ద దెబ్బే వేసింది. పోయిన సంవత్సరం వచ్చిన బ్రహ్మోత్సవం కన్నా కాస్త మెరుగేమో గానీ 130 కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమాకి వచ్చే వసూళ్ళు మాత్రం కాదు.

     15.5 కోట్ల పెట్టుబడి

    15.5 కోట్ల పెట్టుబడి

    యుఎస్ బయ్యర్ ఈ చిత్రంపై రూ.15.5 కోట్ల పెట్టుబడి పెట్టాడు. అంటే ఈ చిత్రం 3 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయాలి. కానీ 1.3 మిలియన్ డాలర్ల మార్కును కూడా దాటలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ.70 కోట్లకు బిజినెస్ జరిగితే ఇప్పటికి రూ.23 కోట్ల లోపే షేర్ వచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే ‘బ్రహ్మోత్సవం'కు ఏమాత్రం తగ్గని డిజాస్టర్ అయ్యేలా కనిపిస్తోంది ‘స్పైడర్'.

    English summary
    Superstar Mahesh Babu’s Spyder which has got lukewarm response from critics has failed to rake big numbers on day one.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X