ఆ ఎక్స్ పెక్టేషన్ కి పవన్ రీచ్ అవుతాడా...?!
దూకుడు, ఊసరవెల్లి వంటి భారీ చిత్రాల హడావిడి తర్వాత ఇప్పుడు అందరి చూపూ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ 'పంజా"పైనే ఉంది. దసరా సీజన్ లో మహేష్, జూ ఎన్టీఆర్ సినిమాలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దూకుడు 1600 థియేటర్స్ రిలీజ్ అయితే ఊసరవెల్లి 1800థియేటర్లో రిలీజ్ చేశారు. కలెక్షన్స్ లోనూ దూకుడు కంటే ఊసరవెల్లి ఫిగర్స్ ఎక్కువ కనిపించాయి. ప్రతి సెంటర్ లోనూ దూకుడు పోస్టర్ పక్కనే ఊసరవెల్లి పోస్టర్ వేసేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనేది పక్కన పెడితే ఈ రెండు సినిమాలు చేసిన హల్ చల్ మామూలుగా లేదనేది నిజం. ఈ సినిమాల తర్వాత రిలీజ్ కాబోతున్న భారీ చిత్రం 'పంజా" .
పంజా" సినిమాపై నానాటికీ అంచనాలు పెరుగుతున్నా కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు హల్ చల్ చేస్తుందనేది అభిమానులకి అంతు చిక్కడం లేదు. ఎందుకంటే పంజా చిత్రం విపరీతమైన కాంపిటీషన్ ఉన్న సమయంలో విడుదలకి సిద్దమవుతుంది. అలాంటి సమయంలో యావరేజ్ యావరేజ్ స్టఫ్ ఉన్న సినిమాలు ఎక్కువ కాలం బాక్సాఫీస్ వద్ద నిలబడలేవు. రాజన్న, బాడీగార్డ్, శ్రీరామ రాజ్యం, బెజవాడ, నిప్పు వగైరా చిత్రాలన్నీ ఫ్రెష్ గా ఉన్న టైమ్ లో పంజా చాలా బాగుందనే టాక్ వస్తే తప్ప పెద్ద హిట్ అవలేదు.
పవన్ కళ్యాణ్ కి భారీ హిట్ ఇచ్చే సినిమా ఇదే అనే ఫీలింగ్ ఫ్యాన్స్ కి బలపడేకొద్దీ దీనిపై భయాలు కూడా అధికమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాపై అంతగా ఆశలు లేని ఫ్యాన్స్ ఇప్పుడు అధిక పోటీ గురించి ఆందోళన పడుతున్నారు. అయితే ఇండస్ట్రీ టాక్ ని బట్టి సినిమా బాగుందనే అనిపిస్తోంది. ప్రేక్షకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే కనుక పంజాకి పోటీతో ఎలాంటి తలనొప్పీ లేనట్టే.


Click it and Unblock the Notifications











